11, సెప్టెంబర్ 2023, సోమవారం

*రక్షణ వలయం-జాతక విశ్లేషణ*

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*రక్షణ వలయం-జాతక విశ్లేషణ*


కొందరి జాతకాలలో గ్రహాల యొక్క అమరికను అనుసరించి వారి జీవితం రక్షణ వలయంలో ఉంటుంది అనగా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారు. వీరికి జీవితంలో అన్ని వైపుల నుంచి రక్షణ ఏర్పడుతుంది శత్రువులు ఉండరు శిక్షలు ఉండవు ధనానికి లోటు ఉండదు సమాజం గౌరవం ఉంటుంది అనుకున్న పని సాధించగలుగుతారు ప్రమాదాలు ఉండవు దీర్ఘకాలిక ఇబ్బందులు ఉండవు. వీరు పట్టుదలగా, సరి అయిన ప్లానింగ్ ద్వారా పనిచేస్తారు. జాతకుడు యొక్క లగ్నానికి ద్వాదశ అధిపతి శుభగ్రహం అయి ఉండి ఆ గ్రహానికి శని భగవానులతో సంబంధం ఏర్పడాలి. శని భగవానుని తో కలిసి ఉన్నా, దృష్టి ఉన్నా, శని భగవానుని నక్షత్రంలో స్థితి పొందినా, శని భగవానుడు 12వ అధిపతి యొక్క నక్షత్రంలో స్థితి పొందినా, 12వ అధిపతి మకర కుంభాలలో స్థితి పొందినా,శని భగవానుల నుండి 8, 12 స్థానాలలో ఆ శుభగ్రహం ఉన్నప్పటికీ ఈ యోగం ఉంటుంది. వీరు జీవితకాలం అంతా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారని చెప్పాలి ఈ 12వ అధిపతికి శని భగవానుని తో సంబంధం ఏర్పడినప్పుడు ఆ శుభ గ్రహము మరియు శుభగ్రహం ఉన్న నక్షత్ర అధిపతి , ఆ శుభగ్రహము ఉన్న రాశి అధిపతి కూడా అద్భుతమైన ఫలితాలను జాతకులకు ప్రసాదిస్తారు. ఒక లగ్నానికి12వ అధిపతి శుభగ్రహం అయినప్పుడు మాత్రమే ఈ యోగం వర్తిస్తుంది. ఉదాహరణకి మేష లగ్నానికి 12వ అధిపతి గురుడు వీరికి ఈ రకమైన కాంబినేషన్ ఉంటే యోగం వర్తిస్తుంది. అదేవిధంగా మిధున లగ్నం, సింహ లగ్నం, తులా లగ్నం వృశ్చిక లగ్నం మకర లగ్నం.వీరికి మాత్రమే పై కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ యోగం వర్తిస్తుంది. మేష లగ్న జాతకులకి గురువు మకరంలో ఉన్నప్పుడు నీచ పొందుతారు. అయినప్పటికీ గురు భగవానుడు ఈ జాతకులకు శుభ ఫలితాలు ఇస్తారు. తులా లగ్న జాతకులకు బుధుడు మీనంలో నీచమైన ఫలితాలు ఇస్తారు కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తారు. సింహలగ్న జాతకులకు చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు అయితే మాత్రమే శుభ ఫలితాలను పొందగలుగుతారు లేనిచో ఈ యోగం వర్తించదు. మీ జాతకాలు ఈ రక్షణ వలయంలో ఉన్నాయేమో పరిశీలించుకోండి. మీ భవిష్యత్తు గురించి ఎటువంటి చింతా అవసరం ఉండదు.



కామెంట్‌లు లేవు: