శ్లోకం:☝️
*అలం కిల లలజ్జిరే*
*సపది చిత్రగుప్తాదయః |*
*స ఏవ పురుషాగ్రణీమ్-*
*అవతు దేవ దక్షోఽసి చేత్ ||*
అన్వయం: _(హే దేవ !) సపది చిత్రగుప్తాదయః అలం లలజ్జిరే కిల ! | (యది) దక్షః అసి చేత్ , సః ఏవ పురుషాగ్రణీమ్ అవతు ||_
భావం: ఓ దేవుడా! చిత్రగుప్తుడు మొదలగువారు కూడా తమకు రోజూ అలవాటైన పని (పాపాల చిట్టాలు రాయడం) కూడా చేయలేకపోతున్నామే! అని సిగ్గుపడిపతున్నారు. (అంటే తాను చిత్రగుప్తుడికి చేతులు నొప్పి పెట్టి ఇక రాయలేనన్ని పాపాలు చేశానని భక్తుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు !) కనుక దేవా ! నీవే ఆర్తత్రాణ పరాయణుడవైతే, ఈ మహాపురుషుడిని రక్షించి నిరూపించుకో ! ( ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు వంటి పుణ్యాత్ములను రక్షించడం కాదు. ) 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి