🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 90*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*దదానే దీనేభ్యః శ్రియమనిశ మాశానుసదృశీ*
*మమందం సౌందర్యప్రకర మకరందం వికిరతి |*
*తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే*
*నిమజ్జ న్మజ్జీవః కరణచరణ ష్షట్చరణ తామ్ ‖*
తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే = అమ్మా శ్రీ భ్రమరాంబికా,
నీ సౌభాగ్యకరమైన పాదములు దేవలోకంలో పూచే మందారముల గుత్తి వలె ఉన్నవి.
అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి = నీ పాద పుష్పాలు అమన్దమైన (అల్పము కాని) సౌందర్య మకరందమును (జ్ఞానానందమును) ప్రకటిస్తున్నాయి.
నిమజ్జ న్మజ్జీవః కరణ చరణ ష్షట్చరణతామ్ = ఆ గుత్తిలోని మకరందమును ఆస్వాదించటానికి నా జీవుడనే తుమ్మెద, దాని ఆరు పాదాలతో నీ పాద మందారములలో మునిగిపోయింది. జ్ఞానానందమును అనుభవించే జీవుడికి ఇక లౌకిక వ్యవహారములలో ఆసక్తి ఉండక, సదా ఆ ఆనందంలో మైమరచిపోతూ ఉంటాడు సమాధి స్థితిలో
శ్రీ రామకృష్ణ పరమహంస వలె, రమణ మహర్షి వలె.
తుమ్మెద మకరందం త్రావుతూ మైమరచి ఇక ఆ పూవును వదలలేని మైకంలో పడి, అలాగే ఉండిపోతుంది. ఒక్కొక్కసారి పద్మముల వంటి పుష్పములు రాత్రి వేళ ముడుచుకుపోయినప్పుడు అందులో నుండి కదలలేక అందులోనే ప్రాణములు విడుస్తుంది.
ఇప్పుడు ఈ జీవుడికి కల ఆరు చరణములేమిటి? పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు (అంతఃకరణ సముదాయము) ఏ వస్తువైనా, ముందు జ్ఞానేంద్రియము (కన్ను ముక్కు చెవి నాలుక చర్మము) తో స్వీకరింపబడి మనస్సును చేరి అనుభవింపబడుతున్నది. ఇక్కడ అమ్మవారి పాదములలో ఆశ్రయము పొందవలెనంటే షట్చక్రముల ఛేదన ద్వారా సహస్రారమును చేరే సాధన చేయటమని భావించవచ్చు. ఆ విధంగా అనన్య భక్తినీ,సంపూర్ణ శరణాగతిని చేసి సాధన చేసే జీవునికి
దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీ = దీనేభ్యః అంటే అహంకార రహితులైనవారికి, వారి కోరికలననుసరించి (ఆశా అనుసదృశీమ్)
శ్రియం అనిశం ఎల్లప్పుడూ శుభములను మోక్షమును, దదానే ఇస్తుంది అమ్మవారి పాదద్వయం.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి