28, నవంబర్ 2023, మంగళవారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 14*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *14. మూర్తి నాయనారు*


పాండ్యదేశానికి రాజధాని అయిన మదురైలో వణిగ వంశంలో మూర్తినాయనారు అవతరించాడు. భక్తియే స్వరూపంగా కలిగిన నాయనారు మధురైలో నెలకొని ఉన్న శివునికి రోజూ చందనం అరగదీసి ఇస్తూ

ఉండేవాడు.


ఒక పర్యాయం కర్ణాటక రాజు పాండ్యదేశంపై దండెత్తి యుద్ధంలో

పాండ్యరాజును ఓడించి దేశాన్ని తన కైవశం చేసుకున్నాడు. అతడు విభూతి  ధారణ చేసిన శివభక్తులపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. జైనమతాన్ని దేశంలో

వ్యాపింపజేయడానికి కంకణం కట్టుకున్నాడు. మూర్తినాయనారును జైన

మతానికి మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. 


కాని అతని

సంకల్పం నెరవేర లేదు. మూర్తినాయనారు చేస్తూ వస్తున్న చందన

కైంకర్యానికి విఘ్నం తీసుకురావాలని తలచి అతనికి ఎవరూ చందనం

కట్టెలు ఇవ్వకూడదని కట్టడి చేశాడు. ఈ రాజు నా కైంకర్యానికి అడ్డంకిని

కలిగించాడు. 


కాని చందనాన్ని అరగదీసే నా చేతులకు అతను ఏవిధంగా

అడ్డంకిని కలిగించగలడు? అని భావించి మూర్తినాయనారు తన చేతులను

చందనం అరగదీసే రాయిపై పెట్టి అరగదీయడం ప్రారంభించాడు.

చేతిపైనున్న చర్మం ఊడిపోయింది. రక్తం ప్రవాహంగా కారడం

ప్రారంభించింది. ఎముకలు కూడ బయటపడ్డాయి. అయినప్పటికీ మూర్తి

నాయనారు తన పనిని కొనసాగించాడు. 


ఆ రోజు రాత్రి మూర్తినాయనారుకు

పరమేశ్వరుడు కలలో ప్రత్యక్షమై "నీకు అపకారం తలపెట్టిన ఈ రాజు

త్వరలోనే నశిస్తాడు. ఈ రాజ్యం నీ చేతికి వస్తుంది. నీవు యథాప్రకారం

నాకు కైంకర్యం చేస్తూ చివరగా కైలాసంలో నా సన్నిధికి చేరుకుంటావు”

అని అనుగ్రహించాడు.

ఆరోజు రాత్రే కర్ణాటకరాజు మరణించాడు. 


చనిపోయిన ఆరాజుకు

సంతానం లేరు. సమర్ధుడైన రాజు లేకపోతే దేశం నశించిపోతుందని

దేశంలోని పెద్దలందరూ కలసి ఆలోచించారు. “ఒక ఏనుగుకు కళ్లను గంతలు కట్టి వదలుదాం. అది ఎవరిని తీసుకువస్తుందో వారినే మనం

రాజుగా చేద్దాం” అని తీర్మానం చేశారు. అదేప్రకారం పట్టపుటేనుగు కళ్లకు

గంతలు కట్టి వదిలారు. 


ఆ ఏనుగు రాజవీధుల గుండా వచ్చి అక్కడ నిలబడి ఉన్న మూర్తినాయనారు మెడలో మాలనువేసింది. మంత్రులు,

రాజ ప్రముఖులు మొదలైనవారు మూర్తినాయనారును ఆహ్వానించి వారికి

 వైభవంగా పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించారు. 


మూర్తినాయనారు

పవిత్ర పంచాక్షరినే పఠిస్తూ పరమేశ్వరుని ధ్యానంలో కాలం గడిపాడు.

ప్రజలందరినీ తన కన్నబిడ్డలవలె కాపాడుతూ చివరగా పరమేశ్వరుని

తిరుచరణాలను చేరుకున్నాడు.

*పద్నాల్గవ చరిత్ర సంపూర్ణం*

     

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: