28, నవంబర్ 2023, మంగళవారం

 *జైశ్రీరామ్*


                              15-5-2020

                              అభ్యాసం-13


                             *సుభాషితం*


"కర్తా కారయితా శ్ఛైవ

  ప్రేరకా శ్ఛనుమోదకః |

  పుణ్యకార్యే పాపకార్యే

  చత్వార స్సమభాగినః"||


                            *భావం*


చేసేవాడు, చేయించేవాడు, ప్రేరణ ఇచ్చేవాడు, చేసిన కార్యాన్ని అమోదించేవాడు  ఈ నల్గురు కూడా పుణ్య పాప కార్యాలలో సమమైన భాగస్వాములు అవుతారు.

       మనం చెయ్యటంలేదుకదా అని స్త్రీలపై అఘాయిత్యాలు, గోహత్యలు, దేవాలయాల విధ్వంసం, ధార్మిక గ్రంధాలు అవమానం, స్వామీజీలు-పూజారులపై హత్యలు మన కళ్ళముందే ఇన్ని జరుగుతున్నా మనమంతా చూసీచూడనట్లు, వినీవిననట్లు ఉంటున్నాం,కాని దురదృష్టం ఏంటంటే ఆ పాపాలన్నింటిలో మనకుకూడా భాగస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేక పోతున్నాం. 


                       *అమృతవచనం*


 *బ్రహ్మర్షి*వసిష్ఠులు* వారు *దశరధ* *మహారాజుతో* విశ్వామిత్రుడు యజ్జ్న రక్ఛణార్దం రాముని పంపమని అడిగినప్పుడు, రాముని పట్లగల ప్రేమ వాత్సల్యం తో నిరాకరిస్తూ ఇదితప్ప వేరే ఏదైనా కోరుకోమన్నప్పుడు ఇలా అన్నారు:

       రాజా ! ఇక్ష్వాకువంశంలో పుట్టావు.ధర్మమూర్తివని,సత్యవాదివని ముల్లోకాలలో కీర్తి సంపాదించావు.ఇంతటివాడివి ఆడినమాట తప్పుతావా ! ఇలా చేస్తాను అని ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి.ఇచ్చినమాట నిలబెట్టుకోపోతే దేవతల ప్రీతికోసం చేసిన యజ్జ్నయాగాదులవలన వచ్చిన పుణ్యం,ప్రజల సుఖంకోసం త్రవ్వించిన చెరువులు,నూతులు మొదలైన పుణ్యకార్యాలవల్ల లభించిన పుణ్యం అంతా పోతుంది.

      విశ్వామిత్రుడు నీవద్దకు నిస్సహాయుడై రాలేదు.తలచుకుంటే ఆ రాక్షసులను తానే స్వయంగా సంహరించగలడు.ఆ మహాత్ముడు నీ కుమారులకు మేలుచెయ్యాలనే కోరికతో వారిని తనతో పంపమంటున్నాడు.వేరే ఆలోచన లేకుండా రాముణ్ణి ఇతడివెంట పంపు.నువ్వు,నీ సైన్యం,నీ రాజప్రాసాదం రాముడికి రక్ఛణ అనుకుంటున్నావేమో, అది ఉత్తి భ్రమ.రాముడికి ఈ *కౌశికుడి* రక్ఛణను మించిన రక్ఛణ వేరొకటి లేదు.

      అప్పుడు దశరధుడు వశిష్ఠులవారి మాటలమీద పూర్తి విశ్వాసం ఉంచి తానే స్వయంగా రామలక్ష్మణులను సిద్దపరచి విశ్వామిత్ర మహర్షి కూడా సంతోషంగా అడవులకు పంపుతాడు.

       పూర్వకాలంలో మహారాజులు, చక్రవర్తులు కులగురువుల, రాజగురువుల మాటలను విని శిరోధార్యంగా స్వీకరించేవారు.

       అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఇప్పటి పరిపాలకులు ఆశ్రమ పీఠాధిపతులను, మఠాధిపతులను,స్వామీజీలను కనీసం  గౌరవించటం మాని విమర్శిస్తూ వారికి  తగిన రక్షణకూడా కల్పించలేకపోతున్నారు.కలియుగ ప్రభావమో ఏమో !


                         శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

కామెంట్‌లు లేవు: