*బ్రతుకు ధనం కోసం కాదు ధర్మం కోసం. జీవిత పరమార్ధం భుక్తి మాత్రమే కాదు- భక్తి, సమత్వ బుద్ధి ప్రధానం.*
ప్రకృతిలోని చరాచర సృష్టి జీవనానికి అర్ధం. పరమార్ధం ఉంటాయి. చీమ నుంచి బ్రహ్మ వరకు రూపాలు వేరువేరుగా ఉన్నా ఎవరి పరిధిలో జీవనం వారిది. జీవిత కాలం కూడా నిర్దేశితమై ఉంటుంది. జీవిత లక్ష్యం తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి మాత్రమే ఉంది. మానవులు బుద్ధిజీవులు. మిగిలిన అన్ని ప్రాణులకు స్వయం నిర్ణయాధికారం లేదు. అవి ఏ జాతికి చెందినవో ఆ జాతి లక్షణాలు మరణించే వరకు ఉంటాయి. అవి కేవలం చిన్న పరిధిలోనే బతుకుతాయి. ఆకలి, నిద్ర, మైధునం భయం... నాలుగింటికే ఆలోచన. ఆచరణ | పరిమితమవుతాయి. మనిషి జీవిత లక్ష్యానికి పరిమితి లేదు. అది ఆకాశమంత విశాలం. జీవిత లక్ష్యం మోక్ష సాధన అని వేదాంతులు చెబుతారు.
ఎవరి జీవితం ఎలా గడుస్తుందో మాత్రం ఎవరూ కచ్చితంగా నిర్ణయించలేరు, జాతకం, జ్యోతిషశాస్త్రం సైతం కొంతవరకే ఊహించగలవు ఎవరి జీవితానికి వారే నిర్ణేతలు. సూచనలు, సలహాలు, హితోక్తులు, సందేశాలు... వంటివి అనేకం అందుబాటులో ఉన్నాయి. స్వీకరించడం, తిరస్కరించడంలో ఎవరికి వారి స్వీయ నిర్ణయం. మనుషులు అందరూ గొప్పవారు కాకపోయినా.? మంచివారు మాత్రం కావాలని పెద్దలు చెబుతారు. మంచితనమే మానవతా లక్షణం.
ఒక మనిషి ప్రవర్తన ద్వారానే అతడి జీవితాన్ని అందరూ అర్థం. చేసుకుంటారు. వృత్తివ్యాపారాలు, వివిధ రంగాల్లో ప్రవేశం వారివారి అభిరుచులు, అర్హతలను అనుసరించి జరుగుతుంది. సాధించిన అవకాశం, అధికారం క్రమంగా మార్పు తెస్తాయి. తర్కబద్ధంగా, విజ్ఞతతో కూడిన జ్ఞానంతో కొందరు ఆదర్శవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. సేవ, సహాయం సామాజిక న్యాయం అందరికీ అందించి తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటారు. మరి కొందరు తమకు లభించిన వాటిని దుర్వినియోగం చేయడమే. లక్ష్యంగా భావిస్తారు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రగిల్చి సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టి ఆనందిస్తారు.
రామాయణంలో కబంధుడు, విరాధుడు అలాంటివారే. యక్షులు, గంధర్వుల స్థాయికి చేరుకున్న స్థితి నుంచి మద, మాత్సర్యం, అహంకారంతో సాధువులు, సజ్జనులను అవమానించి వారి శాపానికి గురయ్యారు. ఉన్నతమైన స్థానం కోల్పోయి రాక్షస స్వభావంతో నీచ స్థానం పొందారు. పురాణాల్లో రాక్షసులుగా నిలిచారు. బ్రతుకు ధనం కోసం కాదు ధర్మం కోసం. జీవిత పరమార్ధం భుక్తి మాత్రమే కాదు- భక్తి, సమత్వ బుద్ధి ప్రధానం.
చరిత్రలో తామర్లేన్, చెంఘిజ్ ఖాన్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. కార్యదక్షత, పట్టుదలతో పేరు సాధించారు. అంత ఘనమైన | స్థాయికి చేరినవారు అసంబద్ధంగా, క్రూరంగా ప్రవర్తించి చరిత్రహీనులయ్యారు.
ప్రతివారూ తమ జీవిత అర్థం తెలుసుకోవాలి. తమ జీవన గమనం పరిశీలించుకుని అవసరమైతే. మార్చుకోవాలి. ప్రేమ, దయ, జాలి, కరుణతో పాటు సహనం, సంయమనం, సహజీవనం సాగిస్తే మానవులుగా చీరస్మరణీయులు అవుతారు. ప్రపంచంలో నియంతృత్వం ఎంతో కాలం కొనసాగలేదు. అధర్మానికి ఆయువు తక్కువ, సత్యమే శాశ్వతంగా ఉంటుంది.
శాంతికాముకులు, సత్ప్రవర్తన కలిగినవారి జీవితం సఫలమవుతుంది. వసిష్ఠుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందాడు. ఆయన శక్తి, సామర్ధ్యాలు చూసి ఈర్ష్యతో విశ్వామిత్రుడు తానుకూడా బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. అంతటి ఉన్నతమైన పదవి సాధించాలంటే తనలోని ఆరు శత్రువులను (కామ | క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు) జయించాలని గ్రహించి పరివర్తనతో సాధించాడు. బ్రహ్మర్షిగా శాశ్వత కీర్తి సంపాదించాడు. ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే ఆశయంలో తప్పు లేదు. ఎంచుకునే మార్గం ధర్మబద్ధంగా ఉండాలి.
🍁ప్రేమ, త్యాగం, విశాలత్వం జీవిత అర్థాలు, పరమార్ధాలు. అవి తెలుసుకుని జీవిస్తే ధన్యం....
తెలియకుండా బ్రతికితే వ్యర్ధం.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి