10, నవంబర్ 2023, శుక్రవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


శర్యాతి వెంటనే అంగీకరించాడు. ఈ రోజే వెడదాం. ఇద్దరం కలిపివెడదాం. అమ్మాయినీ

అల్లుణ్ణి చూసివద్దాం - అని ఓదార్చాడు. వెంటనే రథం అధిరోహించి చ్యవనమహర్షి ఆశ్రమం చేరుకున్నారు.

రూపయౌవన సంపన్నుడై దేవపుత్రుడిలా వెలిగిపోతూ కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్న మునీశ్వరుణ్ణి

చూశారు. ఇద్దరూ క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేమిటి? ఈ సుందరాకారుడెవరు? ఛీఛీ! ఎంత

మహాపాపం చేస్తోంది మన అమ్మాయి. లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ఠ! గుడ్డిమగడిని చంపేసి ఈ

అందగాడితో కాపురం పెట్టిందన్నమాట. కామపీడితురాలై ఇంతపని చేసిందా? అవును, ఎంతటివారికైనా

యౌవనంలో మన్మథుడు అతిదుస్సహుడుగదా! మనువంశానికి పెద్ద కళంకం, మాయని మచ్చ తెచ్చిపెట్టింది.

కన్యా యోగ్యాయ దాతవ్యా పిత్రా సర్వాత్మనా కిల |

తాదృశం హి ఫలం ప్రాప్తం యాదృశం వై కృతం మయా ॥

(6-16)

కన్నకూతురు కళంకిని అయ్యిందంటే ఆ తండ్రి జీవితం పరమకుత్సితం. అన్ని పాపాలూ

మూటగట్టుకుని ఏడిపించడానికే పుడుతుంది కూతురు. నేనూ పొరపాటే చేశాము. నా స్వార్థం కోసం

వృద్ధాంతానికి కట్టబెట్టాను. అన్ని విధాలా యోగ్యుణ్ణి చూసి కన్యాదానం చెయ్యాలంటారు. నేను

చేసినదానికి తగిన ఫలమే దక్కింది.

(6-19)

ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు. నరికిపారెయ్యాలి. కానీ స్త్రీహత్యాపాతకం

అంటుకుంటుంది. అందులోనూ కన్నకూతిరిని సంహరించడం మరీపాపం. నిష్కళంకమైన మనువంశానికి

నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టినవాడినవుతాను. లోకాపవాదానికి భయపడనా, ప్రేమానురాగాలకు

కట్టుపడవా ? ఏమి చెయ్యాలో తోచడంలేదు.

కామెంట్‌లు లేవు: