🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 83*
బుద్ధుడు అనుభూతి పొందిన బోధిచెట్టు క్రింద కాసేపయినా కూర్చుని ధ్యానం చేయాలనే తపన ఆతడిలో తీవ్రతరం కాసాగింది. కనుక ఏప్రిల్ మొదటి వారంలో ఒక రోజు మధ్యాహ్నం నరేంద్రుడు, తారక్, కాళీ ఎవరికీ తెలియకుండా ఇంటి దొడ్డిదారి గుండా బుద్ధగయకు బయలుదేరారు.
ముగ్గురూ కాషాయాంబరాలు ధరించారు. సన్న్యాసులు ఉంచుకొన్నట్లు చేతిలో పటకారు ఉంచుకొన్నారు. బుద్ధగయకు పోవడానికి మర్నాడు ఉదయం దాకా రైలు లేనందువలన ఆ రాత్రి ఒక దుకాణంలో గడిపారు. నరేంద్రుడు వేకువన మూడు గంటలకల్లా లేచి కిచ్చుడి వండాడు. అది తిని ముగ్గురూ బయలుదేరారు. దారి పొడవునా బుద్ధుని జీవితం గురించే మాట్లాడుకొన్నారు. మూడవ రోజు ఉదయం గయ చేరుకొన్నారు. అక్కడ ఫల్గు నదిలో స్నానం చేసి, పితృ తర్పణాలర్పించారు. అక్కడ నుండి ఎనిమిది మైళ్లు నడిచి సాయంత్రం బుద్ధ గయ చేరారు.
సాయంత్రం సద్దుమణిగాక ముగ్గురూ బోధిచెట్టు క్రింద ధ్యానంలో కూర్చున్నారు. కాసేపటికి నరేంద్రుని ముందు ఒక అసాధారణమైన దివ్యకాంతి కనబడింది. అతడి మనస్సు ప్రశాంతమై, ఆనందంతో నిండిపోయింది. నరేంద్రుడు ఆ ఆనందంలో మునిగిపోయినట్లు కూర్చున్నాడు. బుద్ధుని అద్భుతమైన గుణగణాలు, సాటిలేని కరుణ, మానవత్వం ఉట్టిపడే ఉపదేశాలు, బౌద్ధమత ప్రభావంతో
భారతదేశ చరిత్రలో జరిగిన పరిణామాలు మొదలైనవన్నీ అతడి మనోనేత్రం ముందు భాసించాయి.
అతడి కళ్ల వెంట ఆనందబాష్పాలు స్రవించాయి. ఆ దృశ్యం చెదరిపోగానే అతడు తారక్ ను కౌగిలించుకొని పిల్లవాడిలా విలపించాడు. తారక్, కాళీలు కూడా పరమానందాన్ని చవిచూశారు. మర్నాడు ఉదయం విలపించడానికి కారణం ఏమిటని నరేంద్రుణ్ణి అడిగినప్పుడు, "బుద్ధునితో సంబంధం గల స్థలంలో, ఆయన లేడనే ఆలోచన వచ్చినప్పుడు నా హృదయం వేదనతో తల్ల డిల్లింది. అందుకే విలపించాను" అన్నాడు.
|అక్కడ కాశీపూర్ లో హఠాత్తుగా ఈ ముగ్గురూ కనిపించకుండా పోవడం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అందరూ ఎంతో దిగులు చెందారు. చివరికి వాళ్లు బుద్ధగయకు వెళ్లిన విషయం ఎలాగో తెలిసింది. ఈ సంగతి గురుదేవులతో చెప్పినప్పుడు ఆయన, "అతడు ఎక్కడకు పోగలడు? ఎన్ని రోజులు ఉండి పోతాడు? త్వరలో తిరిగి వస్తాడు. దిగులుపడకండి" అన్నారు. కాసేపటి తరువాత, "మీరు ప్రపంచం నలుమూలలా పయనించి చూడండి. మీరు దేనినీ చూడ లేరు. అక్కడ ఉన్నవన్నీ (తమ దేహాన్ని చూపుతూ) ఇక్కడ ఉన్నాయి"🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి