*నిత్యం నైమిత్తికం చైవ క్రియాంగం మలకర్షణం ।* *తీర్థాభావే తు కర్తవ్యముష్ణోదకపరోదకైః ॥*
*పరోదకైః శీతోదకైః । గంగాదిపుణ్యజలమిశ్రేణేన కూపవాప్యాద్యుద కమపి పవిత్రం భవతి తదుక్తం మత్స్యపురాణే --*
*పుణ్యాంభసా సమాయోగాదుష్టమప్యంబు పావనం । అపవిత్రమపి ప్రాప్య గంగాం యాతి పవిత్రతాం ॥*
ఒకవేళ పుణ్య తీర్థాలు అందుబాటులో లేకపోతే.. నిత్య, నైమిత్తిక, క్రియాంగ మరియు మలకర్షణ స్నానాలను వేడి నీటితో (ఉష్ణోదక) లేదా సాధారణ చల్లని నీటితో (పరోదక) చేయవచ్చు.
పుణ్య నదుల నీటితో కలిసినప్పుడు వేడి నీరు లేదా అశుద్ధమైన నీరు కూడా పవిత్రమవుతుందని మత్సపురాణ వచనం.
అలాగే గంగాజలంతో చేరిన ఏ అపవిత్రమైన వస్తువైనా పవిత్రతను పొందుతుందని మహాభారతం చెబుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి