13, జనవరి 2026, మంగళవారం

సుభాషితమ్

  ॐॐ卐 *నేటి సుభాషితమ్* 卐ॐॐ


  శ్లో𝕝𝕝 *“చింతనీయాహి విపదాం*

          *ఆదావేవ పతిక్రియా*।

          *న కూప ఖననం యుక్తం*

          *ప్రదీప్తే వహ్నినా గృహే"* ॥

           

తా𝕝𝕝 *“రాబోయే ఆపదలను గ్రహించి వాటికి ముందుగానే ప్రతిక్రియలను ఆలోచించాలి*. 


భావము:

ఇల్లు తగులబడుతూ ఉంటే అప్పుడు నుయ్యి త్రవ్వాలనుకోవటం యుక్తం కాదుకదా?" అని ఈశ్లోకానికి భావం.

@@@@@@@@@@@@@@@@


`నా అనువాద పద్యం`


తే.గీ.

దూరదృష్టిచే నాపదఁ బాఱఁజూచి 

చింతఁజేయ నివారణ చెలగు సుఖము 

యుక్తమవబోదు కష్టమ్ము లొదవు పిదప 

గృహము తగలడ నుయిఁ ద్రవ్వఁ గెరలినట్లు 

------------

కెరలు=విజృంభించు 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: