15, ఫిబ్రవరి 2024, గురువారం

బ్రహ్మవిద్య

 *బ్రహ్మవిద్య-అర్హత* 


*ప్రపంచంలో మొత్తము లెక్కవేసికొంటే తాను ఎదుటివానికి పెట్టింది ఎక్కువా?ఎదుటివాని దగ్గర తాను చేయించు కున్నది ఎక్కువా? లెక్కవేసికొంటే….*


*నిద్రలో కూడా గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్పిన విషయం ఇది, నేను చెప్పింది కాదు; తాను ఇతరులకు చేసిన దానికన్న,ఇతరుల దగ్గరనుండి తాను పొందినది ఎక్కువ అయినవానికి బ్రహ్మవిద్య ఆ జన్మలో ఏనాడూ సిద్ధించదు.*


*అపరిగ్రహముండాలి.*


*జన్మ మొత్తము లెక్కవేసుకొంటే-తాను ఇతరులచేత చేయించుకొన్న దానికన్న, తాను ఇతరులకు చేసింది ఏనాడయితే ఎక్కువ అవుతుందో బ్రహ్మవిద్య రావడానికి అవకాశముంది.*


*అయితే, ఆ ఎక్కువ వచ్చాక కూడా, చాలాకాలానికి, ఇన్నాళ్ళ నుంచి ఇతరులకు నేను చేసిందే చాలా ఎక్కువ అని నసపుడుతుంది లోపల. ఇలాంటి మనోవికారానికి లొంగిపోవడం జరుగుతుంది.*


*ఏదో, ఈ పదేళ్ళ నుండియు, పాతికేళ్ళ నుండియు - పెద్దవాళ్ళ మాటవిని  ప్రతివాడికీ చాకిరీ చేయడమే తప్ప, ఎవరివద్ద ఏమీ పుచ్చుకొన్నవాడిని కాను అని ఏడుపు పుడుతుంది. ఇలాంటి నస, ఏడుపు మానివేసే సమయం వస్తుంది కొన్ని జన్మలయ్యాక. ఏడుపు మానివేసి సంతోషంగా వుండే సమయం వస్తుంది. వాడికది చేశాను, వీడికది చేశాను అని వాపోయే దుష్టదారిద్య్ర స్థితి పోతుంది మనకు.*


*అప్పటిదాకా మోక్షవిద్యకు అవకాశం లేదు, పరమ ప్రశాంతికి అవకాశం లేదు. అపరిగ్రహం రావాలి.*


*ఎవరికయినా సరే అయిదు రూపాయల పనిచేసిపెట్టి, రెండు రూపాయల పని పుచ్చుకోవాలి వాని వద్ద. మిగతా మూడు రూపాయలు అతనివద్దనే అట్టిపెట్టాలి. ఈ సేవింగ్స్ బ్యాంక్ చేతనై ఉండాలి.*


*అయిన తరువాత కూడా, మన తాలూకు అకౌంట్ ఇతరుల బ్యాంకులో ఉన్నదనే భావం మనస్సులో నుండి వదలాలి.*


*గుర్తుండటమనేది వదలవలసినదే. ఆ పీనాసితనం, పీనిష్టితనం, కంకుష్టం - అంటే మనమింత పుణ్యం చేశామనే దరిద్రం మనస్సుకు వదలిపోవాలి.*


*అప్పటినుంచి గాని పెద్దలు చెప్పిన మోక్షవిద్యకు మనకు అర్హత రాదు. ఇది యదార్థం.*


                  _*Master E.K.*_

కామెంట్‌లు లేవు: