మన మహర్షులు- 25
భరద్వాజ మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
భరద్వాజ మహర్షి సప్తఋషులలో ఒకరు.
సప్త ఋషుల గురించి మహాభారతంలోనూ, పురాణాలలోనూ కూడా ప్రస్తావించబడింది.
ఈయన తపస్సు చేసిన ఆశ్రమం పేరు 'భరద్వాజతీర్థ'
దేవతల గురువైన బృహస్పతి కుమారుడు 'భరధ్వాజుడు'.
మహాభారతం లో కురుపాండవుల గురువైన ద్రోణాచార్యుడు భరద్వాజుని కుమారుడే...
ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు. ఇలా భరద్వాజ వంశం వృద్ధి అయింది.
భరద్వాజుడు భృగుమహర్షిని అడిగి పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి..సృష్టి ఎలా జరిగింది ..వంటి అనేక విషయాలు తెలుసుకున్నాడు.
చరక సంహిత ప్రకారం, ఈతడు వైద్య శాస్త్రాన్ని దేవతల రాజు అయిన ఇంద్రుని వద్ద అధ్యయనం చేసాడు.
భరద్వాజుడు మూడు కాలాలు తెలుసుకోకలిగిన జ్ఞానంతో గొప్ప తపశ్శక్తితో చాలామంది శిష్యుల్తో తన ఆశ్రమంలో వున్నాడు.
రామాయణంలో భరతుడు తన అన్న అయిన రాముణ్ణి అయోధ్యకు తిరిగి తీసుకురావడానికి అయోధ్య ప్రముఖులతో, మంత్రులతో, పురజనులతో, చతురంగ బలాలతో అడవికి బయలు దేరతాడు. భరధ్వాజ మహర్షి ఇతని భాతృభక్తిని పరీక్షించి, ప్రశంసించి భరతునితో పాటు వచ్చిన అందరికీ తన తపశ్శక్తితో షడ్రసోపోతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. శ్రీరాముడు వనవాస సందర్భంగా భరద్వజ దంపతులను దర్శించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటాడు.
భరద్వాజుడు తీర్థయాత్రలు చేస్తూ వ్రేపల్లె వచ్చి యమునానదిలో స్నానం చెయ్యాలనుకుని అక్కడున్న వాళ్లని రేవు చూపించమన్నాడు. వాళ్ళు ఆయన్ని ఆటలు పట్టించారు
గోపాల బాలకులతోనూ, బలరాముడితోనూ అందరితో కలిసి అక్కడ తిరుగుతున్న శ్రీకృష్ణుడు పరుగుపరుగూ వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు.
భరద్వాజుడు అతణ్ణి శ్రీకృష్ణుడయిన విష్ణుమూర్తి అవతారంగా తెలుసుకుని స్తోత్రం చేశాడు.
భరద్వాజుడు రాజధర్మాల్ని చెప్తూ రాజుకి గద్ద చూపు, కొంగ వినయం, కుక్క విశ్వాసం, సింహ పరాక్రమం, కాకి సంశయం, పాము నడక ఉండాలని, ధర్మకార్యక్రమాలు
ఎలా చెయ్యాలో, దోషుల్ని ఎలా దండించాలో కూడా శత్రుంజయుడనే రాజుకి చెప్పాడు
ఒకసారి గొప్పగొప్ప మనులందరూ భరద్వాజుడి దగ్గరకొచ్చి శాస్త్రోక్తంగా ఉదయం ముఖం కడుక్కోవటం దగ్గర్నుంచి పడుక్కునే వరకు అన్ని పనులు ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. ఏ కొత్త పని మొదలు పెట్టినా తూర్పువైపు తిరిగే మొదలుపెట్టాలని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు భరద్వాజుడు. ఈ గ్రంధాన్నే 'భరద్వాజ స్మృతి' అన్నారు.
అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం...
భరద్వాజుడు వైమానిక శాస్త్రం' అంటే విమానాలు ఎలా తయారు చెయ్యాలి అని, ఒక గ్రంథం రాశాడు. ఈ పుస్తకంలో ఎనిమిది అధ్యాయాలున్నాయి
మనం ఇప్పుడు తెలుసుకుంట్నుది భరద్వాజ మహర్షికి ఎపుడో తెలుసన్నమాట.
ఈ విమానం ఎలా వుంటందంటే విరగనిది కోసినా తెగకుండా కాలిపోకుండా ఉండేది నాశనంకాకుండానూ వుంటుంది. .
. ఈ విమానంలో శత్రువుల మాటలు వినగలిగేలా, ఫోటోలు తీసుకోగలిగేలా,
శత్రువిమానం రాకపోకలు తెలుసుకోగలిగేలా పైలట్లని మూర్చపోయేలా చెయ్యకలిగేవి
చాలా పరికరాలుంటాయి. అంటే ఇవి యుద్ధవిమానాలేమో.
విమానానికి 31 భాగాలుండాలనీ. విమానం నడిపే వాళ్ళకి వేరువేరు బట్టలుండాలనీ, కాలాన్ని బట్టి తినడానికి మూడు రకాల ఆహార పదార్థాలుండాలనీ వాటి వల్ల గాలిలో ఉండే ఇరవై అయిదు రకాల విషాలు ఏం చెయ్యకుండా వుంటాయనీ రాశాడు.
పదహారు రకాల లోహాలో తయారు చేస్తే ఏ వాతావరణానికయినా తట్టుకుని చెక్కు చెదరకుండా వుంటుందిట.
ఈ విమానం తయారు చేసే పద్ధతి అద్భుతంగా వుంది కదూ..
జ్ఞాననిధులు మన మహర్షులు ..🙏🙏🙏
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి