ధర్మసందేహాలు-సమాధానం
🍁🍁🍁🍁
ప్ర: సూర్యుడు రథం మారే రోజు కాబట్టి రథసప్తమి అని పేరు వచ్చింది అంటారు. ఇది అజ్ఞానం కాదా? సూర్యునికి రథం ఉందా? సూర్యుడు రథం మార్తాడా?
జ: వేదభాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రథము అనే మాటకి అర్థం - గమన లక్షణము కలది రథము. ఇక్కడ గమనం అంటే కాంతి.
సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. మనం ఉన్న స్థితి బట్టి అలా కనబడుతుంది అనే విషయం సృష్టిలో మొట్టమొదటిగా చెప్పినది వేదం.
ఎలాంటి పరికరాలు లేకుండానే యుగాల క్రిందటే ఈ విషయం చెప్పిన మన మహర్షులకి ఇంత చిన్న విషయాలు తెలియవా?
ఇదొక్కటి ఆలోచిస్తే మన హైందవ ధర్మం గొప్పదనం తెలుస్తుంది.
పూర్తి వైజ్ఞానిక స్పృహతోనే సూర్యారాధన చేసిన జాతి భారత జాతి. కేవలం నమ్మకం కాదు. విశ్వాసానికి కారణం ఒక విజ్ఞానం. సూర్యున్ని కేవలం ప్రకృతిలో ఉన్న ఒక మండుచున్న అగ్నిగోళము అని దర్శించకుండా ఒక చైతన్య స్వరూపమైన భగవంతుని ఆకారం అనే ఉదాత్త భావన మన విజ్ఞానంతో కూడిన విశేషం. ఆ విజ్ఞానాన్ని ఆధారం చేసుకొనే మన విశ్వాసం ఆధారపడి ఉంది.
సూర్యుడు రథం మారుతాడు అంటే సూర్యుని కాంతి యొక్క గమనము మారుతుంది అని చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం. ఆ మార్పు వచ్చిన సప్తమిని రథసప్తమి అని వ్యవహరిస్తాం.
వేదభాష సంకేత భాష. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలే తప్పా అజ్ఞానం అని తోసేస్తే మన అజ్ఞానం బయటపడుతుంది.
🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి