🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌷నేనూ,'మిథునం'🌷*
🌷🌷🌷
సాధారణంగా, మనవో మంచి కథనో, నవలనో చదివినప్పుడ దానికి, మనసులో ఓ పటం కట్టేసు కుంటాం. మీ అందరి సంగతీ ఏవోగానీ, నేను మాత్తర వంతే! ఆ రచైత మహత్తరంగా వొర్ణించేడూ, పాత్రల్నీ అంటే, మరీనూ. అయ్యి కళ్ళముందే నిలిచిపొయ్యి నిచ్చతాండవమే! అట్టా గుండెకి అత్తుకుపొయ్యి చదూ తున్నప్పుడల్లా, గిలిగింతలు పెడతా, సివరాకరి కొచ్చే ప్పటికి, గుండెని సివుక్కుమనిపిచ్చి, కళ్ళని సెరువులు సేసేసి, మసకబారిన సూపుకి కాసింతసేపు యితరాలు కనపడకుండా సేసే వృద్ధజంట కతనే *'మిథునం'*. అది మొట్టమొదటగా అచ్చులో వొచ్చినప్పుడే చదివేసి,
ముగింపు దుఃఖాన్ని, శ్రీరవణగారికి ఉత్తరంలో కుమ్మ రిచ్చిగాని, కుదటపడలా. ఆ కథని గుండెల్లోనూ, తరవాత పుస్తకంగా వొచ్చాక కొనీసుకుని బీరువాలోనూ, బద్రంగా దాచుకున్నా. అప్పట్టోనే ఎంతోమంది మిత్రులకిచ్చి చదివిచ్చా. ఎన్నో, ఎన్నెన్నోసార్లు నేనూ చదివా, రావాయణంలెక్కన!చదివిన ప్రతీసారీ లంకంత పెరడూ, అందులో కంఠాలు చింపుకుంటో చిటచిట మాటల్తో, బావి దగ్గర బకెట్లకొద్దీ నీళ్ళు తోడినెత్తిన పోసుకుంటోన్న బక్కపల్చటి బర్తగారూ, పూలూ, కాయలూ కోస్తో అందవైన ముసలి జింక లాంటి బార్యా కళ్ళక్కడతారు. ఎంత సుందర దృశ్యవనీ? ఏదో ఆళ్ళపాటికి ఆళ్ళు, ఆళ్ళింటోనే పడివున్నారు కాబట్టి కానీ, ఏ కొడుకులింటో వున్నా
ఆళ్ళని బరించగలరాని? పిల్లలకన్నా కనాకష్టం గోలయ్యే యిద్దరిదీనూ! ఇతరులెవ్వరికీ ప్రవేశవే లేని మరో ప్రెపంచం వారిద్దరిదీనూ. అదే,వేరెవ్వరైనా సరే, 'ముసలాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్టాడుకు చస్తానే వుంటారు', అని ఈసడించి పడెయ్యరూ? అందుకే, వాళ్ళింటోనే వాళ్ళగోలల్లో వాళ్ళు కిందా మీదా పడుతుంటారు. ఆ దశాబ్దానికే అత్యుత్తవవైన అంత చక్కని, తేటనీటి ప్రవాహవూ, పారిజాతవనవూ, రవివర్మ చిత్తరవూ, వగైరాలవంటి ఆ కథాకన్యని, శ్రీరవణగారి కళాసృష్టిని, సినీమాగా తియ్యబోతున్నారు, అనంగానే నెత్తిన పిడుగుపడ్డట్టే అనిపిచ్చింది. గుండెనెవరో గుప్పెట్టో నొక్కేసినట్టు వొహటే బాధ. అది ఓ పెద్ద కథ మాత్రవే, పైగా యిద్దరే మూలస్తంభాలూ.
పూరీపిండి వుండతో,రుమాలీరోటీ వొత్తితే చిరిగి చీలికలయ్యి పోదూ?ఈ కథ కూడ ఎంతదనీ? దాన్నో సినీమాగా సాగదియ్యడానికీ ఎన్నెన్ని అతుకులో
గందా వెయ్యాలీ? కథ చదవకుండా, సినీమా చూసిన వాళ్ళు ఆనందించ గలరేవో కాని, నాలా కథకి హృదయం పారేసుకున్న వారికి పరకంతన్నా నచ్చుతుందాని? అసలా వృద్ధజంటని ఎంపిక చెయ్యడవే ఓ యజ్ఞవయ్యే. ఆ పి.యల్. నారాయణగారు బతికున్నా బాగుండేది, అతికినట్టుండేవారు ఆహార్యానికి. ఆయన పక్కన, 'గోదావరి' సిన్మాలో, నాయికకి హీరోగారి మామ్మ 'గోరింటాకు' పెడుతుంది. ఆవిడయితే చక్ఖగా సరిపొయ్యే వారు. జోడీ సరే, కథాసాగదీతల సంగతో? ఎంత దిగులేసిందో, ఏవేవి కలిపి దాన్ని కలగూరగంపని చేస్తారోనని?సరే, గడపదాటని బంగారుతల్లి లాంటి పదారణాల పల్లెపిల్లలాంటి కథని, ఏకంగా తెరపైకెక్కించి తైతక్కలాడించేందుకు,
అంగీకరించారని శ్రీరవణగారిమీద ఎంతకోప వొచ్చిందో? సరే, ఆయన సృష్టీ, ఆయనిష్టం, అనుకొని మర్చిపొయ్యేందుకుఅష్టకష్టాలూ పడ్డాకాని, పనవ్వలే. చివరికా సినీమా వొచ్చిపడింది, జహనమ్మీద. సహజ పరిమళ భరితవైన మల్లిపువ్వుకీ, రంగుల ప్లాస్టీకు పువ్వుకీ వున్నంత తేడా వుంది కథకీ, సినీమాకీ, అన్నారు చూసొచ్చిన మిత్రులొకరు. ఆయన కూడ ఆకథకి దాసోహపడ్డవారే. 'అప్పాదాసుగారిందులో సకలకళా కోవిదులూ, గొప్ఫమానవతా మూర్తులూ, మన్నూమశానవూనూ. అసలిందులోజంట, నిజ్జంగానే సినిమా జంట. అంతా డ్రామాలే, సహజత్వవే లేదు. మన కథలో జంట మాత్తరవే, అస్సలయిన, నిఖార్సయిన *'మిథునం',* మన వెరిగినవాళ్ళూ, మనకయిన వాళ్ళూనూ! సినిమాలో వాళ్ళు బొత్తిగా అపరిచితుల్లా చిరాగ్గా అ(క)నిపించారు, వాళ్ళ అతి వేషాలతో ' అన్నారు, ఆత్మీయంగా కతలో వాళ్ళని తలచుకొంటా! ముందే రకరకాల బయాల్తో వున్న నేను, ఈనాటికీ ఆసినీమా చూళ్ళేదు. రంగోలీ చూస్తే, రవివర్మ చిత్రాన్ని చూసినట్టు కాదుగా?అందుకే పుస్తంకంతోనే వున్నా.
'మిథునం'ని మస్తకంలోనూ, మనసులోనూ నింపుకునే వున్నా!అమృతవే తాగినాక, పాయసవేం రుచిస్తుందీ?
🌷🌷🌷
(ఇది ,కేవలం నా మనసుకి తోచినది మాత్రవే. దానిని సినిమాగా మాత్రవే మొదటిసారి చూసి ఆనందించిన
అదృష్టవంతులందరికీ, హృదయపూర్వక అభినందనలు!)
సేకరణ: వాట్సాప్ పోస్ట్.
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి