17, నవంబర్ 2022, గురువారం

జంతు వాద్యం - జైలు

 జంతు వాద్యం - జైలు


ఒకసారి ఘటం మ్యాస్ట్రో విక్కు వినాయకరం గారి అబ్బాయి శ్రీ సేల్వగణేశ్ న్యూఢీల్లి కచేరిలో కంజీర వాయించారు. మరుసటి రోజు పత్రికలలో ఆయన అద్భుతమైన ప్రదర్శన గురించి చాలా గొప్పగా వచ్చింది. దాన్ని చూసిన అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ఆ కంజీర జంతువుల చర్మంతో చేయబడినది అని తెలుసుకుని జంతువుల హక్కులు కాపాడాలని సేల్వగణేశ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యవలసిందిగా పోలీసులను ఆదేశించారు.


ఆ వార్త విన్న వెంటనే వినాయకరం గారి ఇంట్లో భయాందోళనలు మొదలయ్యాయి. అదిగాక, కంజీరను జంతువు చర్మంతోనే చేస్తారు. ఎన్నో ఏళ్లుగా వాటిని ఇలాగే చనిపోయిన జంతువుల చర్మంతో తయారుచేస్తారు. సమయాభావం వల్ల వాళ్ళ న్యాయవాదిని కూడా కలవలేకపోయారు.


వినాయకరం గారికి వెంటనే మహాస్వామివారు గుర్తుకు వచ్చి, భోరున ఏడుస్తూ కంచికి కాలినడకన వస్తాన మమ్ములని కాపాడమని మొక్కుకున్నారు. కంచికి వెళ్తూ దారిలో టి త్రాగడం కోసమని ఒక దుకాణంలో ఆగారు. టి తాగుతూ అక్కడున్న రేడియోలో నుండి వస్తున్నా వార్తను విని ఆశ్చర్యపోయారు.


ఏవో కారణాల వల్ల ఆ పర్యావరణ శాఖ మంత్రిని ఆయన పదవి నుండి తొలగించినట్టు ఆ వార్తా సారాంశం. దాంతో ఆయన కుమారున్ని అరెస్టు చెయ్యలేదు.


జంతువుల చర్మంతో చేసిన వాయిద్యములనే మంగళ వాయిద్యములు అంటారు. శుభకార్యాలలో వీటిని తప్పక వాయించాలి. వీటిని చనిపోయిన జంతువుల చర్మంతో తయారుచెయ్యాలి కాని, వాటిని తయారుచెయ్యడం కోసం జంతువులను చంపరాదు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: