17, నవంబర్ 2022, గురువారం

కార్తికం

 *అనేక పేర్ల కార్తికం*


స్కాందపురాణంలో న కార్తీక సమో మాసః అనే వాక్యం ఉంది అంటే కార్తికంతో సమానమైన మాసం లేదు అని అర్థం. కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్నందున ఈ మాసం కార్తికమైందన్న విషయం తెలిసిందే. చాంద్రమానం ప్రకారం కార్తిక మాసానికి నాలుగు పేర్లు ఉన్నాయి. అవి కార్తికం, బహుళం, ఊర్జం, కార్తికి. ఈ నాలుగు పేర్లలో ఒక్కొక్క పేరుకు ఒక్కో విశిష్టత ఉంది. కృత్తికా నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని పేరు. చలిబాధ అధికమైన ఈ మాసంలో శరీరంలోని అగ్నిని చల్లారకుండా కాపాడేది (అంటే పూర్తి చలికాలం ఇంకా రాదు) కనుక ఈ మాసం కార్తికం అయింది. బహుళ మైన ప్రయోజనాలు అందించేది కనుక దీనికి బహుళం అనే మరో పేరు ఉంది. అలాగే ఊర్జం అంటే ఉత్సాహం. కొన్ని రకాల నియమ నిష్ఠలు పాటించటానికి ఉత్సాహం ఉండాలి. వాటివల్ల ఉత్సాహం వచ్చే అవకాశమూ ఉంది. చలిగా ఉన్నా ఉదయాన్నే స్నానానికి వెళ్లే వారు ఉంటారు. అదే ఉత్సాహం. ఈ కారణాల వల్ల ఈ మాసానికి ఊర్జం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక క కృత్తికా నక్షత్రంతో అనుబంధమైన మాసం కాబట్టి కార్తికం అనే పేరు వచ్చింది. ఇవి కాక ఈ మాసానికి కౌముది మాసం అనే పేరు కూడా ఉంది. కౌముది అంటే వెన్నెల. శరత్కాలపు స్వచ్ఛమైన వెన్నెల జాబిలి ఈ మాసంలో అం దంగా ప్రకాశించి సకల జీవ కోటికి ప్రశాంత


తను, పరమానందాన్ని కలిగిస్తుంది. దీపావళి మొదలు కార్తిక మాసం నెల రోజుల పాటు ఉదయం సాయంకాలాల్లో దీపాలు వెలిగిస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.


🚩  🚩

కామెంట్‌లు లేవు: