🔔 *సత్సంగం* 🔔
🙏🪷మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
🙏🪷దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి…
*🙏శ్లో:"అనాయాసేన మరణం*
*వినా దైన్యేన జీవనం*
*దేహాంతే తవ సాన్నిధ్యం*
*దేహిమే పరమేశ్వరం."*
*🙏"అనాయాసేన మరణం"🙏*
🙏🪷నాకు నొప్పి లేక బాధ లేని
మరణాన్ని ప్రసాదించు.
*🙏"వినా ధైన్యేన జీవనం"🙏*
🙏🪷నేను ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
*🙏"దేహాంతే తవ సాన్నిధ్యం"🙏*
🙏🪷మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేనునిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
*🙏"దేహిమే పరమేశ్వరం"🙏*
🙏🪷ఓ భగవంతుడా నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
🙏🪷1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
🙏🪷2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ .... నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను, కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
🙏🪷3. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
🙏🪷ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.
🙏🪷దీనినే ‘ *దర్పణ దర్శనం’* అంటారు, మనస్సనే దర్పణంలో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి