6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 431*


⚜ *కర్నాటక  : మందార్తి _ ఉడిపి* 


⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం* 



💠 మందర్తి దుర్గా పరమేశ్వరి ఆలయం శక్తి ఆరాధనలో ముఖ్యమైన మరియు పవిత్రమైన ఆలయాలలో ఒకటి.  

మహిషాసురమర్ధిని మరియు చాముండేశ్వరి యొక్క రాతి చిహ్నాలతో పాటు, ఇది తొమ్మిది పాత ముసుగులను కలిగి ఉంది, ఇది దేవత యొక్క విభిన్న రూపాలను వర్ణిస్తుంది.  ఆలయంలో నాగతీర్థం అనే చెరువు కనిపిస్తుంది.


💠 ఈ అమ్మవారు సుదేవ మహర్షిని కాపాడడానికి అవతరించింది.

సుదేవ మహర్షి  హేమాద్రి మహారాజు  దేవవర్మకి  ఆయన భార్య  జలజాక్షికి

మహిషాసురుని అకృత్యాలనుండి కాపాడతానని శరణు ఇచ్చాడు.  


🔆 స్థలపురాణం 🔆


💠 నాగలోకాధిపతియైన శంఖచూడునికి ఐదుగురు కుమార్తెలు.

మందరతి , నాగరతి , దేవరతి , చారురతి , నీలారతి అని పేర్లతో పెంచాడు.

వారిని శివపుత్రుడు ,  షణ్ముఖుడైన కుమారస్వామికే యిచ్చి పెళ్లి చేయాలనే కోరికతో వుండేవాడు.


💠 ఆ 5 నాగపుత్రికలకు

యవ్వనం వచ్చాక తండ్రి కోరిక తీర్చేందుకు  కుమారస్వామిని పరిణయం చేసుకోవాలని కైలాసానికి వెళ్ళేరు.

కానీ , అక్కడ నందదీశ్వరుడు

వారిని ఆడ్డగించడంతో వాగ్వాదము పెరిగి  నందీశ్వరుడు వారిని భూలోకంలో నాగులై చరించమని శపించాడు.


💠 దేవ వర్మన్ అనే రాజు ఏదో ఒక దండనకు లోనై హిమాద్రి కొండలలోని అడవులలో సంచరిస్తూండగా అక్కడ అడవి కారుచిచ్చులో చిక్కుకున్న ఐదు నాగులను రక్షించి తన బట్టలో మూటకట్టుకున్నాడు. 

వాటిని  తనతో పాటు తీసుకుని వెళ్ళాడు.

అవి  సమయం చూసుకొని ఒక్కొక్క చోట ఒక్కొక్క పుట్టలో దూరి

పోయాయి.


💠 ఆ విధంగా  మందరతి అన్న

నాగిని  వెళ్ళిన ప్రదేశానికి 'మందార్తి ' అని పిలవబడింది.

ఇతర నాగకన్యలు వెలసిన స్ధలాలను  నాగర్తి,  అర్చనమహ, శూరడి, నీలావరా అని ప్రసిధ్ధిపొందాయి.

ఈ ఐదు స్ధలాలలో దుర్గా పరమేశ్వరీ

ఆలయాలు  నిర్మించబడ్డాయి.


💠 ఒకసారి ఈ నాగకన్యలు దేవవర్మ కలలో కనపడి హిమాద్రి రాజు యొక్క పుత్రిక జలజాక్షి ఆపదలో చిక్కుకున్నదని వెంటనే వెళ్ళి ఆమెను కాపాడమని చెప్పారు.

దేవవర్మ వెంటనే వెళ్ళి రాజకుమార్తెను కాపాడాడు. 

హిమాద్రి రాజు తన పుత్రికను రక్షించిన దేవవర్మకే ఇచ్చి వివాహం చేసి  తన  రాజ్యానికి రాజుని చేశాడు.


💠 వ్యాఘ్రపాద మహర్షికి కిరతా అనే స్త్రీ కి  పుట్టిన మహిషుడనే రాక్షసుడు జలజాక్షిని 

ఒకసారి చూశాడు.  

జలజాక్షి మీద వ్యామోహంతో ఆవిడని బాధలు పెడుతూ  వచ్చాడు. ఆ రాక్షసుని ముందు  దేవవర్మ శక్తి సామర్ధ్యాలు పనిచేయలేదు.

జలజాక్షి  , దేవవర్మ  యిద్దరూ సుదేవ ముని ఆశ్రమానికి వెళ్లి , శరణు కోరారు.


💠 గొప్ప అతీంద్రియ శక్తులు కలిగిన ముని దుర్గాపరమేశ్వరి అనుగ్రహంతో  మహిషుడు పంపి మహోదరుడనే  రాక్షసుడు ప్రయోగించిన ఆయుధాలని అన్నిటినీ మింగేశాడు.

కోపంతో మహిషుడే స్వయంగా యుధ్ధానికి దిగాడు. 


💠 మునికి అండగా దుర్గాదేవి తన భూతగణాలతో  దుర్గాదేవి, మహిషాసురుని ముందు చెదల పుట్టగా అవతరించినది. 

అనేక ఆయుధాలతో పుట్టను నేలమట్టం చేయాలని చూశాడు.


💠 ఆ భయంకర చెదల పుట్ట మహిషాసురుని ఆయుధాలనన్నిటిని మింగి వేసింది.  

ఆఖరికి, దుర్గాదేవి భైరవుని సహాయంతో మహిషాసురుని అణిచి తన కాలితో తొక్కిపట్టినది.

శక్తిహీనుడైపోయిన మహిషాసురుడు అమ్మవారి కాళ్ళు పట్టుకొని , " ఇంక నా దేహం నీ కాళ్ళక్రిందనే వుంటుంది. అనుగ్రహించమని" ప్రార్ధించాడు.


💠 మహర్షి ప్రార్ధనకి కరుణించి అవతరించనట్లే , తన ప్రార్ధనలు కూడా మన్నించి ఈ ప్రాంత భక్తులను కాపాడుతూ వారి కోరికలు నెరవేరుస్తూ అక్కడే కొలువై వుండమని వేడుకొన్నాడు.

మహిషుని  ఆఖరి కోరిక నెరవేర్చి లోక కళ్యాణం కోసం మందార్తిలో దుర్గాదేవి వెలసింది.


💠 పిదప హేమాద్రి మహారాజు దేవవర్మ స్వప్నంలో కనిపించి తను వున్న ప్రదేశాన్ని తెలిపి తనను తీసుకుని వచ్చి ప్రతిష్టించమని ఆదేశించింది.

మహారాజు దుర్గాదేవి తెలిపిన చోటున లభించిన విగ్రహా రూపాన్ని తీసుకువచ్చి

ప్రతిష్టించి ఆలయం నిర్మించాడు.

ఈనాటికి  శ్రీ దుర్గా పరమేశ్వరి

అనే పేరుతో మహిమాన్వితమైన అమ్మవారిగా భక్తులు ఆరాధిస్తున్నారు.


💠 కేరళ శైలిలో , 5 అంతస్తుల గోపురం కలిగిన ఆలయం యిది.

లోపలికి ప్రవేశించగానే ధ్వజస్ధంభాన్ని, బలిపీఠాన్ని చూస్తాము.


💠 గర్భగుడిలో  ఆశీనురాలైన దుర్గాదేవి వరద హస్తాలతో అభయమిస్తూ పుష్పాలంకారాకృతితో భక్తులకు దర్శనము అనుగ్రహిస్తున్నది .


💠 లోపలి ప్రాకారంలో వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి తీర్ధం సమీపమున నాగదేవతల విగ్రహాలను దర్శిస్తాము


💠 ఈ ఆలయంలో యక్షగాన,కణ్డేసేవ, గణేశచతుర్ధి,షష్ఠి, నవరాత్రి, రంగ పూజలు, కుంకుమార్చనలు వంటి అనేక

ఉత్సవాలు వైభవోపేతంగా చేస్తారు.


💠 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో  ఘనంగా జరిపే రధయాత్రోత్సవంలో లక్షలాది  భక్తులు

పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.


💠 దుర్గా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు చండీహోమాలతో ఘనంగా జరుపుకుంటారు.  మందర్తి దుర్గా పరమేశ్వరి ఆలయంలో మకర మాసంలో ఐదు రోజుల మఠోత్సవాలు మరియు కుంభమాసంలో జాతర వార్షిక మరియు ముఖ్యమైన సంఘటనలు.


💠 మందర్తి ఉడిపికి ఉత్తరాన 30 కి.మీ దూరంలో ఉంది.  

కామెంట్‌లు లేవు: