6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

జలము కనుగొనుట -

 నిర్జల ప్రదేశం నందు చెట్ల ద్వారా జలము కనుగొనుట - 


 * తాటి చెట్టుకి కాని టెంకాయ చెట్టుకి గాని పుట్ట ఆవరించి ఉండిన దానికి పశ్చిమమున 6 మూరల దూరమున నాలుగు మాటల లోతున దక్షిణమున నుంచి వచ్చెడి జలధార ఉండును. 

 

 * టెంకాయ చెట్టుకి దక్షిణమున పుట్ట ఉండిన దానికి ఏడు మూరల దూరమున 5 మట్టుల లోతున సంరుద్ధజాలం కలిగి ఉండును. ఒక నిలువు లోతున నానా వర్ణములు కలిగిన శల్యములు , నల్లని రంగు కలిగిన మ్రుత్తికయు , ఆయుధములతో చేధించ దగిన పాషాణం ( రాయి ) , తెల్లని మన్ను, దాని క్రింద పడమట నుంచి ప్రవహిన్చేడు జలధార యు ఉండును. మరియు పుట్టలు ఉండిన యెడల వాటి సమీపమున జలము ఉండును. 

  

 * మారేడు చెట్టు, కానుగ చెట్టు, జీడి చెట్టు, మద్ది చెట్టు, చిత్తముధపు చెట్టు, వీటి యందు యే చేట్టుకైనా పుట్ట చుట్టుకొని యుండిన దానికి ఉత్తరమున మూడు మూరల దూరము నందు నాలుగున్నర నిలువు లోతున సమృద్ధిగల జలం ఉండును. నీరు లేని నిర్జల ప్రదేశం నందు గంబీరమైన శబ్దం పుట్టిన యెడల అచ్చట 35 పురుష ప్రమాణమున ఉత్తరమునకు ప్రవహించే జలనాది ఉండును. 


  * పెద్ద మాను చెట్టు కొమ్మలు అన్ని సరీగా ఉండి వాటిలో ఒక కొమ్మ నేలకు వంగి గాని , తెలుపు వర్ణం కలిగి కాని యున్దినట్లితే అచ్చట మూడు మట్ల లోతున జలం ఉండును. 


  * యే వృక్షం అయినా వాటి వాటి స్వభావం మారి చిగుళ్ళు, పువ్వులు, కాయలు మొదలగు వాటి వరనములు బెధముగా ఉండిన యెడల దానికి తూర్పున మూడు మూరల దూరమున నాలుగు మట్టుల లోతున జలం ఉండును. దాని యందు తెల్లని మన్ను రాళ్ళు ఉండును. 

 

 * రెండు తలల ఖర్జూరం చెట్లు ఉండిన యెడల దానికి పడమర మూడు మూరల దూరం నందు మూడు మట్టుల లోతులో స్వచ్చ జలం ఉండును. 

 

 * తెల్ల మోదుగ చెట్టు ఉండిన దానికి దక్శినమున మూడు మూరల దూరము నందు మూడు మట్టుల లోతున జలము ఉండును. 

 

 * యే ప్రదేశమున వేడి పొగలు ఉండునో అచ్చట రెండు నిలువుల లోతు అదిక ప్రవాహము గల జలదార ఉండును.


 * యే ప్రదేశము నందు పైరులు నలుపక్కల కోమలముగా నుండి మద్య యందు మాడిపోయి ఉండిన , తెలుపు వర్ణం కలిగి యుండినను మికకిలి కొమలముగా నుండినను అచ్చట అదిక ప్రమాణం గల జలదార నిలువు లోతు ఉండును. 

 

 * మరుభూమి అనగా నిర్జలమైన కొండల యందు ఉండు అరణ్యభుమి ములు మొదుగ చెట్టు కు పడమర పుట్ట యుండిన దానికి దక్షిణమున మూడు మూరల దూరము నందు 12 నిలువుల లోతున పడమటి నుండి ప్రవహించే జలనాడి ఉండును. 


 * దురద గొండి చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన దానికి మూడు మూరల దూరము నందు 10 మట్టుల లోతున దక్షిణమున నుండి ప్రవహించే జలనాడి ఉండును. మరియు నిలువు లోతున పచ్చని వర్ణం గల కప్ప ఉండును . 

 

 * మరియు మద్ది చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన యెడల దానికి దక్షిణమున రెండు మూరల దూరమున 15 పురుషుల ప్రమాణమున దక్షిణము నుంచి ప్రవహించే ఉప్పు నీటి జలదార ఉండును. 

 

బావి తవ్వునప్పుడు రాళ్లు పడినప్పుడు వాటిని బెధించుటకు ఉపాయం - 

 

 

 * బావి తవ్వునప్పుడు శిలలు కనిపించినప్పుడు వానిని పగలగోట్టుటకు మోదుగు కట్టెలను , దూబర కట్టెలను కాల్చి ఆ బూడిదను సున్నపు నీళ్ళలో కలిపి రాతిని తడిపి పగలగొట్టిన రాయి పగులును.


  * పూర్వము చెప్పినట్టుగా మోదుగ , తుబుర కట్టెలను కాల్చిన బూడిదను , దర్భల బస్మము , మొక్కలపు చెట్టు చెక్కలను, కాల్చిన బూడిద నీళ్లలో కలిపి ఆ నీళ్లు చక్కగా కాచి కాల్చిన బండ మీద 7 పర్యాయములు పోసి తడపగా రాళ్లు పగులును. 

 

 * ఉత్తరేను, తిప్పతీగా, వేపచెక్క, ఆకు, తుభర కట్టెలు, నువవు కట్టెలు, వీని బూడిద ను ఆవు ముత్రములో కలిపి కాచి 6 దినములు రాళ్ళ మీద పోసి నానబెట్టిన యెడల శిలలు పగులును. 

 

 * అరటి పట్టలను కాల్చి ఆ బూడిదను మజ్జిగ యందు కలిపి చక్కగా కాచిన తరువాత అందులొ రాతిని పగలగొట్టడానికి ఉపయొగించే ఆయుధములు ఒక దినమంతయు అందులొ నానబెట్టి రాతిపై ప్రయోగించగా ఆ ఆయుధములు చెడకుండా ఉండును. అలాగే ఆ ఆయుధముల చేత రాళ్లు , ఇనుము మొదలగు వాటిని పగలగొట్టిన ఆ ఆయుధములు మెరుపు , పదును పోకుండా ఉండును. 


       మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: