28, సెప్టెంబర్ 2020, సోమవారం

**సౌందర్య లహరి శ్లోకము -10**

 దశిక రాము**




**శ్రీ శంకర భగవత్పాద విరచితము**


**శ్రీ లలితాంబికాయైనమః**


10వ శ్లోకం


**సుధాధారా సారై**


**శ్చరణ యుగళా న్తర్విగళితైః**


**ప్రపంచం సిఞ్చన్తీ** 


**పునరపి రసామ్నాయ మహసః,**


**అవాప్య స్వాం భూమిం**


**భుజగనిభ మధ్యుష్ఠవలయం**


**స్వమాత్మానం కృత్వా**


**స్వపిషి కులకుణ్డే కుహరిణి!!**

.

అమ్మా! భగవతీ! నీపాద పద్మాల రెంటి మధ్య 

ప్రదేశం నుంచి స్రవించే అమృత ధారల చేత 

ప్రపంచాన్ని తడుపుతూ అమృతానికి నిధానమై

కాంతిచే వెలుగొందే చంద్రుణ్ణి వీడి స్వస్థాన మైన

ఆధార చక్రాన్ని మరల ప్రాపించి , దాన్లో స్వస్వరూపా

న్ని సర్పం మాదిరి కుండలాకారంగా గావించి

తామర దుద్దు నడుమన వుండే సన్నని రంధ్రం వలె

ఎంతో సూక్షమమైన పృథివీ తత్త్వం లో కుండలినీ 

శక్తివై నిద్రిస్తావు.



**ఓం అష్ట మూర్థ్యాత్మికా యైనమః**


**ఓం అష్ట దారిద్ర్య శమన్యైనమః**


**ఓం శాంభవ్యైనమః**


🙏🙏🙏


**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: