28, సెప్టెంబర్ 2020, సోమవారం

*జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*

సందేహం;- మా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏఏ స్తోత్రాలు చదవాలో దయచేసి తెలియజేయగలరు.

సమాధానం;- గాలి ఎక్కువగా పీల్చుకోవడం, నీళ్ళు ఎక్కువగా త్రాగడం, మితంగా సాత్విక ఆహారం తీసుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఇవి మన ఆరోగ్య సౌధానికి నాలుగు ప్రధాన స్తంభాలు. ఆపైన ఈ క్రింది స్తోత్రాలు చదువుకుంటే భగవదనుగ్రహం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది.

*(01)*

ప్రతిరోజూ ఉదయించే సూర్యుని ముందు నిల్చొని *ఆదిత్య హృదయం* చదవాలి. శాస్త్ర పద్దతిలో సూర్య నమస్కారాలు కూడా చేస్తే మంచిది.

*(02)*

వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని యాభై తొమ్మిదవ సర్గ పారాయణం చెయ్యాలి. ఇది మనలోని అహంకారాన్ని, అంతః శత్రువులను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది.

*(03)*జాతకాలు చూపెట్టి జ్యోతిష్కులు చెప్పిన మహాదశ, అంతర్ధశలలోని గ్రహదోషాలను నివారించడానికి, వాయు పురాణంలోని *ఉమా సంహిత* లో సూచించిన విధంగా ఆయా ఘట్టాలు పారాయణం చెయ్యాలి.

*(04)*

నవగ్రహాలకు అధిపతి శ్రీసుదర్శనులవారు. భగవంతుని సంకల్పానుసారం వారు నడుస్తారు. మన కర్మ ఫలాలను, ప్రధానంగా అనారోగ్యములను నియంత్రించే ఆదేశాలను భగవంతుడు నరసింహ దివ్య రూపంలో సుదర్శనుల వారికి కటాక్షిస్తారని ప్రసిద్ధి. అందువల్ల వారికి ప్రీతి కలిగించే సుదర్శన శతకము, సుదర్శనాష్టకం, నృసింహాష్టకం, లక్ష్మీనరసింహ శతనామావళి పారాయణం అర్చన చేయడం మంచిది.                                         

*(05)*

అనారోగ్యాన్ని దూరం చేయడానికి ధన్వంతరి అష్టోత్తర శతనామ అర్చన సత్ఫలితాన్నిస్తుంది.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: