28, సెప్టెంబర్ 2020, సోమవారం

ఓం సౌరాష్ట్రే సోమనాధం చ !

 సప్త జన్మల పాపం నశించి సన్మార్గ వర్తనలు కావడని కీస్తోత్రం అత్యంత ఫలప్రదాయమైనదనీ - కేవలం స్మరణ మాత్రాన సంకల్ప సిద్ది కలుగుతుందనీ వివరించారు మన పూర్వీకులు.

" ఓం సౌరాష్ట్రే సోమనాధం చ !

శ్రీ శైలే మల్లికార్జునం !!

ఉజ్జయిన్యాం మహాకాళం !

ఓంకారే పరమేశ్వరం !!

కేదారం హిమవతః పృష్ఠేః !

ఢాకిన్యాం భీమశంకరం !!

వారణాస్యాం తు విశ్వేశం !

త్ర్యంబకం గౌతమీతటే !!

వైద్యనాధం చితాభూమౌ !

నాగేశం దారుకావనే !!

సేతుబంధే చ రామేశం !

ఘశ్మేశం చ శివాలయే !!"


శ్లో. ద్వాద శైతాని నామాని - ప్రాతరుత్థాయ యః పఠేత్‌

సర్వ పాప వినిర్ముక్తం - సర్వసిద్ధిప్రదం లభేత్‌ ||

యం యం కామ మపేక్ష్యైవ - పఠిష్యంతి నరోత్తమాః

ప్రాష్యంతి కామం తం తం హే - పరత్రేహ మునీశ్వరాః ||

ఏతేషాం పూజనే నైవ - వర్ణానాం దుఃఖనాశనం

ఇహలోకే పరత్రాపి - ముక్తిర్భవతి నిశ్చితం ||

ఉదయం మేల్కొంటూనే, ఇప్పుడు చెప్పుకున్న 12 జ్యోతిర్లింగాలను స్తోత్ర రూపాన గాని - నామరూపాన గాని భక్తితో తలచుకొనువారలు పాపాల నుండి విముక్తులవుతారు. ఎవరెవరు ఏ యే కోరికలతో ఇది పఠిస్తారో వారికాయా కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ఇక - ఆ జ్యోతిర్లింగాల దర్శనం, పూజ సిద్ధించిన వారికి ఇహలోకంలో సమస్తసంపదలు కలిగి, పరమునందు ముక్తి తథ్యం! 

కామెంట్‌లు లేవు: