28, సెప్టెంబర్ 2020, సోమవారం

జ్యోతిష్య శాస్త్ర గణనలో భిన్నపద్దతులు

 జ్యోతిష్య శాస్త్ర గణనలో భిన్నపద్దతులను పాటిస్తారు. సూర్యుడి గమనాన్ని అనుసరించి లెక్కగడితే సౌరమానమని, చంద్రుని గమనాన్ని అనుసరించి లెక్కగడితే చాంద్రమానమని అంటారు.


సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ బ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర బ్రమణమే ఆధారం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణా కాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విధంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు .... మేషం, వృషభం, వంటి 12 రాసులలో ఒక్కో రాసిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాసి నుండి మరో రాసిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోనూ జరుగుతుంది. కాబూ మనం మఖర రాశి సంక్రమణాన్ని మాత్రమే మఖర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు...... రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదె అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నె అధిక మాసం అంటారు.


అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్రమానం అంటే చంద్ర కళలను (తిధులను)ఆధారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 క్ష్ 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా వున్నది. ఈ వ్వత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు..... ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమె వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌరమాసాలకు ఒక చంద్రమాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయఋషులు.


ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్ర మాసము నుండి ఆశ్వయుజ మాసం మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మలమాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.

అధికమాసానికి మాధవమాసమని, పురుషోత్తమ మాసమని కూడా పేర్కున్నాయి. ఈ అధికమాసంలో చేసే జపం, దానం, పూజ కోటి రెట్ల ఫలితాన్నిస్తాయి. కార్తీక, మాఘమాసాల వలె అధికమాసంలో కూడా ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానాలు చేయాలి. ఈ మాసంలో ఎదైన కొత్త దీక్ష తీసుకుని, నియమబద్ధంగా గడుపుతూ, ఏదైనా నామజపం లేదా మంత్రజపం చేసినా విశేషఫలితం ఉంటుంది.

కామెంట్‌లు లేవు: