గ్రహములయొక్క యుతి, వీక్షణ, స్థితి యిత్యాదులచే వచ్చిన ఆయుర్థయమును నిర్థేశిక హరణలకు అన్వయించవలసి ఉంటుంది.
1. రాశి నందు ఒకటి కంటే హెచ్చు గ్రహములున్నచో గ్రహము ఇచ్చు ఆయుర్థాయమును సగమునకు తగ్గి ంచవలెను.
2. గ్రహము నీచలో ఉండినా అస్తంగత్వము చెందినా ఆయుర్థాయమును సగమునకు తగ్గి ంచవలెను.
3. గ్రహము శతృక్షేత్రములో ఉన్నచో ఆయుర్థాయమునందు మూడవవంతు ఆయువును తగ్గించాలి.
4. భ చక్ర దృశ్య సగభాగములో పాపగ్రహమున్నచో ఆయుర్థాయమును క్రింది విధంగా తగ్గించాలి.
12 వ యిల్లు - పూర్తిగా💯%
11 వ యిల్లు - సగమునకు( 50%)
10 వ యిల్లు - మూడవ వంతు( 75%)
9వ యిల్లు - పావు భాగము (25%)
8 వ యిల్లు - 1/5 వ భాగము
7వ యిల్లు - 1/6 భాగము
భ చక్ర దృశ్యపు సమభాగములో శుభుడు గాని ఉన్నచో పైన తెల్పిన వివిధ ఇండ్లలో పాపగ్రహము పోగొట్టుకొను ఆయువులో
సగభాగము మాత్రమే పోగొట్టు కొనును.
(5) గ్రహయుద్దమునందు పరాజిత గ్రహము అయినచో 1/ 3 వ భాగము తగ్గించవలెను.
(6) రవి గాని చంద్రుడు గాని గ్రహణమునందున్నచో 1/3 భాగము తగ్గించవలెను.
ఒకే గ్రహము (పైన తెల్పిన) ఒకటి కంటే హెచ్చువిధములైన హరణలకు(తగ్గింపులకు )
గురి అయితే అన్నింటిలో హెచ్చు హరణమును మాత్రమే ఒక పర్యాయమే గురిచేయవలెను.
పూజ్యులు పెద్దలు శ్రీ మాన్ వాసుదేవ శర్మగారు
కోరిన పిమ్మట నా పరిధిలో శోధ్య పిండమును భినాష్టక వర్గరీత్యా ఆయుర్థాయము గణన చేయు విధానమును తెలియజేయడమైనది.
ఇది కాకుండా ఆయుర్దాయమును నిర్థారణ చేయుట కు "నక్షత్రాయు పద్దతి కూడా వాడుకలో కలదు(రెండవ పద్దతి ).
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి