28, సెప్టెంబర్ 2020, సోమవారం

*కాశీ_ఖండం*

 **దశిక రాము**


** 


–PART-8


కవిసార్వభౌముడైన శ్రీనాధుని రచన


ఇతరుల తప్పు ఎంచ లేదు .పరులకు అపకారం చేయ లేదు .త్రికాలాలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని సందర్శిస్తూ నా జీవితాన్ని చరితార్ధం చేసుకొంటున్నాను .ప్రతి పర్వం లోను పంచ గంగా యాత్ర చేస్తున్నాను .తల్లీ విశాలాక్షీ !భవానీ ! శివ రంజనీ !నువ్వైనా కనిక రించవా ?కాశీ పట్టణ దేవత లారా !నేనేమీ నా స్వార్ధం కోసం కాశీ ని వదిలి పెట్టి వెళ్లటం లేదు .దేవతల అభ్యర్ధన మేరకు ,పరోప కారం కోసమే వెడుతున్నాను .పూర్వం దధీచి తన ఎముకను ఇంద్రుడికి ఇవ్వ లేదా ?బలి తన సర్వస్వాన్ని పోగొట్టుకొలేదా ?’’అని అందరికి విన్న విన్చుకొంటు మునులను, ఆబాల వ్రుద్ధులను వృక్ష జంతు కోటికి మ్రొక్కి అందరికి వీడ్కోలు చెప్పి ,ధర్మ పత్ని లోపాముద్ర వ్రేలు పట్టుకొని ‘’పుణ్య రాశి అయిన కాశి ని వదిలి పెట్టి వెళ్తున్నాను ‘’అని కన్నీరు కారుస్తూ ,చప్పట్లు చరుస్తూ’’అయ్యో కాశీ కాశీ ఆరుస్తూ శివ ,శివ అని ప్రలాపిస్తూ కింద పడి పోయాడు మహర్షి .మళ్ళీ కొంచెం స్తిమిత పడి భార్య చేయి ఊత గా తీసుకొని ‘’నాకు వినాశం దగ్గర పడింది ‘’అని పలవరిస్తూ ముందుకు కదిలాడు .


కొద్ది కాలానికే ,ఆకాశ మంత ఎత్తు పెరిగి ,సూర్య గమనానికి నిరోధం గా ఉన్న వింధ్యాద్రి వద్దకు చేరుకొన్నారు దంపతులు .వింధ్యాద్రి భయం తో ఒంగి ‘’స్వామీ ! నేను మీ సేవకుడిని .ఏమి ఆజ్న ?’’అని వినయం గా అడిగాడు .దానికి మహర్షి ‘’వింధ్య రాజా !నువ్వు చాలా ప్రాజ్ఞుడవు .నా శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడివి .నేను దక్షిణ దేశానికి వెళ్తున్నాను తిరిగి వచ్చే దాకా ఇలాగే ఉండు ‘’అని చెప్పాడు .మహర్షి కోప పడ నందుకు సుముఖం గా మాట్లాడి నందుకు,శపించ నందుకు వింధ్య సంతోష పడిఅలాగే వినమ్రం గా కిందికి వంగి ఉండి పోయింది .మహర్షి వింధ్య ను దాటి వచ్చాడు .సూర్యుడు మళ్ళీ తన గమనాన్ని నిరాటంకం గా కోన సాగించాడు .’’నేడోరేపో అగస్త్య మహర్షి తిరిగి వస్తాడు ‘’అని ఎదురు చూస్తూ అలానే ఉండి పోయాడు వింధ్య రాజు .అగస్తుడు మళ్ళీ తిరిగి రాడు ,వింధ్య ఇక పైకి లేవడు అనే సంతృప్తి తో సూర్యుడు మరీ ప్రచండం గా తన దిన యాత్ర సాగించాడు .దుష్టుల సంకల్పాలను ఇలానే మహాత్ములు నీరు గార్చుతారని అందరు అనుకొన్నారు . 


PART-8


🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: