28, సెప్టెంబర్ 2020, సోమవారం

*ధార్మికగీత - 33*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        

                                  *****

*శ్లో:- అంగం గళితం పలితం ముండం ౹*

          *దశన విహీనం జాతం తుండం ౹*

          *వృద్ధో యాతి గృహీత్వా దండం ౹*

          *త దపి న ముంచ త్యాశా పిండమ్ ౹౹* 

                                     *****

*భా:- మానవుడు తన జీవితం క్షణికమని , సిరి సంపదలు చంచలములని తెలిసికూడా ఆశా పాశానికి బద్ధు డవుతున్నాడు. అవయవాలు చిక్కి శల్యమై శిథిల మౌతున్నాయి. తల పెరుగు బుట్ట అవుతున్నది, పళ్ళు క్రమ క్రమంగా ఊడిపోతున్నాయి, నోరు పట్టుతప్పి తినలేని పరిస్థితిలో ఉన్నది. ముసలితనం మీదపడి మూడవ కాలులా కఱ్ఱ చేతిని అలంకరించింది. అయినా మనిషికి "ఆశ" చావడం లేదు. భార్యా బిడ్డలపై మమకారం తగ్గడం లేదు. ధన కనక రాసులపై మోజు వీడడం లేదు. ప్లాట్లు, ఫ్లాట్లు ఇక చాలు అనే తృప్తి కలగడం లేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన,ఆరాటం ఎక్కువవుతున్నాయి. అదే పనిగా ఆశా ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు. మోక్షసాధనకై "రామ" , "కృష్ణ" అనే భగవన్నామాన్ని మనసారా ఒక్క నిమిషంపాటైనా గానం చేసే తీరిక , కోరిక , ఓపిక మనిషికి కనబడడం లేదు. ఆశ అంత బలీయమైనది. సమర్థవంతమైనది. మేధా సంపన్నులను కూడా కాలు జారి బోర్లా పడవేయగల మహత్తర శక్తి "ఆశ" కున్నది. తస్మాత్ జాగ్రత్త!*

                                 *****

                  *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: