28, సెప్టెంబర్ 2020, సోమవారం

చాణక్య నీతి చంద్రిక

 చాణక్య నీతి చంద్రిక 

      ( మంజరీ ద్విపద )


               రచన 

గోపాలుని మధుసూదన రావు 


        

వణిజుండు , బాపడు , వైద్యున్డు , రాజు ,

నిరతంబుపాఱెడు నిర్మలనదియు ,

పైన చెప్పినయట్టి పంచ యంశములు 

యున్నట్టి యూరిలో నుండుము యెపుడు .

అవిలేని సమయాన ననిశంబు నీవు 

వూరిని వదులుము నుండకో క్షణము.                


ఇహలోక యాత్రకై వీలగు వృత్తి ,

పాపచింతలనుండి భద్ర తభయంబు ,

చెడుకార్యములుసేయ సిగ్గులజ్జయును ,

దాతృత్వమున దేలు దాక్షిణ్యవరులు ,

తగుశక్తి నిచ్చెడి త్యాగులౌ నరులు ,

యెచ్చోట నుండరో యెంచి చూడగను 

నచ్చోట నుండుట యర్హత గాదు                         


ధనములు బాయగా దార తత్త్వంబు 

యిక్కట్ల యందున హితుని తత్త్వంబు 

పెన్నిధి నెడబాయ భృత్యు తత్త్వంబు 

పలు వ్యసనాలలో బంధు తత్త్వంబు 

తెలియును వెంటనే తేటతెల్లముగ 

అందఱి తత్త్వంబు లప్పుడే దెలియు                 


అత్యంత దుర్భిక్ష యనుభవంబపుడు 

శత్రు సంకటమందు చరమంబు నందు 

ప్రాణ సంకటమందు ప్రభు సభయందు 

దరిలోన నుండియు ధైర్యంబు జెప్పు 

యాత్మీయుడే నిజ యాత్మబంధుగుడు               


అందంబులేనట్టి యతివైన గాని 

అందంబు లేకున్న యతివను యెపుడు 

కులపింటినుండియే కోరంగ వలయు 

అందముండినగూడ యతివ నేనాడు 

యన్యకులమునుండి యాశించరాదు

ఆత్మకులమునందె యతివను వెదకి 

కల్యాణమొనరించ గల్గును సుఖము.                 


నఖ శృంగ మృగముల , నారుల , నదుల ,

యాయుధపాణుల యవనిపాలకుల ,

విశ్వసించగరాదు వెనువెంట యెపుడు 

చెంతచేరగరాదు చింతించకుండ 

ఆపదల్ గల్గును యతినమ్మకమున.

కామెంట్‌లు లేవు: