28, సెప్టెంబర్ 2020, సోమవారం

*సుందరకాండ - తొమ్మిదవ సర్గ*

  


*(11,12)*


ఈ పుష్పక విమానాన్ని పూర్వం బ్రహ్మదేవుని కోసం దేవశిల్పియైన విశ్వకర్మ స్వర్గంలో నిర్మించాడు. ఆ పుష్పకం సమస్తమైన రత్నాలతో అలంకరింపబడింది. కుబేరుడు కఠోర తపస్సు చేసి దానిని బ్రహ్మ నుండి పొందాడు. తన పరాక్రమంచే కుబేరుణ్ణి నిర్జించి రావణుడు ఆ పుష్పక విమానాన్ని కైవసం చేసుకొన్నాడు.




*(13,14)*


ఆ పుష్పకం తోడేళ్ళ బొమ్మలు మలచబడిన బంగారు, వెండి స్తంభాలతో శోభాయమానంగా ప్రకాశిస్తూన్నది. దాని పై భాగం మేరు, మందర పర్వతాలకు దీటైన, ఆకాశాన్ని తాకుచున్నవా అన్నట్లున్న అనేక కూటాగారాలతో (పెద్ద పెద్ద గదులు) సమలంకృతమై ఒప్పారుతోంది.

*(15)*


అగ్నిమల్లే, సూర్యునిమల్లే ప్రకాశిస్తూన్న ఆ పుష్పక విమానాన్ని విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా ప్రదిర్శించి నిర్మించాడు. దాని లోనికి వెళ్ళడానికి రూపొందించిన మెట్లు బంగారుమయమైనవి. అందులో సుందరమైన వేదికలు అమర్చబడి ఉన్నాయి.


*జై శ్రీహనుమాన్*

కామెంట్‌లు లేవు: