ప్రహ్లాద బాలుడు ప్రజ్ఞాని యైనను
కోరి విద్యలు నేర్చె గురువు కడను
శ్రీరామచంద్రుడు స్థిరచిత్తు డయ్యును
కోరి విద్యలు నేర్చె గురువు కడను
పరమాత్మ కృష్ణుండు బ్రహ్మమే యయ్యును
కోరి విద్యలు నేర్చె గురువు కడను
శంకరాచార్యుడు షట్శాస్త్ర వేద్యుడై
కోరి విద్యలు నేర్చెగురువు కడను
గురువు నేర్పని విద్యకు గురుతు లేదు
ఆరయ భక్తితొ నుతియించ గురువె బ్రహ్మ
ఆరయ భక్తితొ నుతియించ గురువె విష్ణు
ఆరయ భక్తితొ నుతియించ గురువె శివుడు
గురువె పరమాత్మ , మూలంబు గురువు గురువె
గోపాలుని మధుసూదన రావు
గురువులకు నెల్ల గురులై
గురులఘుభావములు లేక కొమరారు జగ
ద్గురులు త్రిలోకహితార్థము
గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్...
ప్రాభాతభాస్కరదర్శనం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
లోకాలవ్యాపించి చీకాకులే గొల్పు
చీకట్లనే బాపు సేవకుడయి
అరుణార్ద్రరాగాల నవనియే పులకించు
మమతలేపండించు మతధనుడయి
అరవిచ్చుమోముల యందాలచిందించు
పద్మాల మురిపించు బాంధవుడయి
ఆరోగ్య భాగ్యోదయాహ్లాదమొదవించు
ప్రత్యుషస్సుల పంచు రాగదుడయి
ప్రతి దినమ్మున ప్రాజ్నగభాసుడైన
వెలుగు విందులగావించు పెద్దయైన
కిరణ సాహస్ర విన్యాస భరితకీర్తి
భాస్కరుని రమ్య దర్శన ప్రాప్తిగలిగె.
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
+91 89197 29199:
***************
40వ పద్యం
మ.
మును నీచే నపవర్గరాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినన్ గీటఫణీంద్రపోతమదవేదండోగ్రహింసావిచా
రిని గాగా, నిను గాన గాక మదిలో శ్రీకాళహాస్తీశ్వరా!
**********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి