*
నిజమైన ప్రేమలో అంచనాలు, బేర సారాలు ఉండవు. ఒక అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు దాన్ని చూసి సంతోషిస్తాం. కాని దాని నుండి ఏమీ కోరుకోము. అది సుందరంగా ఉన్నందున ఆనందిస్తాం. అదే విధంగా ప్రతి ఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్రేమించాలి. ఎందుకంటే ఈ విశ్వంలో అన్నింటికంటే ప్రేమింపదగినవాడు ఆయనే. అటువంటి అవగాహనతో ఉన్న శుద్ధ ప్రేమ వెలకట్టలేని మహోన్నతంగా జీవితంలో భాసిస్తుంది. అది సాధించబడినప్పుడు మనం ఆశించిన దానికంటే అధికమైన ఫలితాన్నే పొందుతాం.
అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.
*శ్రీమన్నారాయణా!*
హే సర్వహిత దేవా! నిన్ను పరిపూర్ణంగా ప్రేమించే హృదయ విశాలతను మాకు ప్రసాదించు, మాలో నీవు మరింత ప్రేమ శక్తిని మేల్కొలుపు. దాపరికం, అంచనాలు లేకుండా మమ్మల్ని మేము అర్పించుకొని తిరిగి స్వార్థ బంధంలో పడకుండునట్లు మమ్మల్ని అనుగ్రహించు, కాని సర్వవేళలా మార్గ దర్శకత్వం కోసం, రక్షణ కోసం నీ వైపే మమ్మల్ని చూడనీ!.
సర్వేజనా సుఖినోభవంతు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి