3, సెప్టెంబర్ 2020, గురువారం

_సిద్ధమంగళ_స్తోత్రం

#శ్రీ_పాద_శ్రీ_వల్లభ_స్వామివారి_సిద్ధమంగళ_స్తోత్రం👍💐💐
.

శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీనరసింహ రాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

దోచౌపాతీదేవ లక్ష్మీ ఘన సంఖ్యా భోదిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్త మంగళరూప
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

ఈ సిద్ధమంగళ స్తోత్రమును మూడు కాలముల యందు పఠించిన వారికి
అవధూతలు,సిద్ధపురుషుల దర్శనభాగ్యం కలుగుతుందని శ్రీపాదుల వారే స్వయంగా తెలియజేసారు..

కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు
ద్వాపర యుగములో కృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు
అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలోప్రస్తావించారు.

శ్రీపాద శ్రీవల్లభులు కలియుగములో ప్రప్రధమ దత్తాత్రేయ అవతారం.తరువాత ఈ గురువు గారు
శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులుగాను,శ్రీ మాణిక్య ప్రభువుగాను, స్వామి సమర్ధుల గాను,శిరిడీ సాయి బాబా గాను
షేగాఁ శ్రీ గజానన్ మహరాజ్ గాను,శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబాగాను అవతరించారు.భగవంతుని అన్ని అవతారాలు అవతారకార్యం ముగియగానే మూలంలో నిక్షిప్తమౌతాయి.కానీ దత్తావతార విశిష్టత ఏమిటంటే ఈ అవతారం కృత యుగం నుండి కలియుగం వరకూ ప్రతి యుగంలోనూ ఉంటుంది.ప్రతి యుగంలోనూ ఒక లక్షా ఇరవై ఐదు వేల మంది అవధూత మహాత్ముల్ని తయారుచేస్తూనే ఉంటానని అని దత్త ప్రభువులు వాగ్ధానం చేసివున్నారు.దత్త సంప్రదాయమైన గురు పరంపర ప్రతి మతంలోనూ కనిపిస్తుంది.

స్వామి వారి జన్మస్థలం: తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యనారాయణ స్వామి వారు కొలువై వున్న అన్నవరం పట్టణానికి
30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం అని పిలవబడుతున్న శ్రీ పీఠికాపురం అనే పట్టణంలో జన్మించారు.అక్కడ
16 సంవత్సరాలు నివశించి,ఆ తర్వాత కృష్ణా నది తీరంలో ఉన్న కురువపురం/కురుగడ్డ లేదా కురుంగడ్డ చేరుకుని అక్కడ
14 సంవత్సరములు తపస్సు చేసి కృష్ణా నదిలో అంతర్హితమయ్యారు.వీరి చరిత్ర శ్రీమాన్ శంకరభట్టుగారు సంస్కృతంలో రచించారు, మల్లాది గోవింద దీక్షితుల వారు తెలుగు ప్రతిని మనకందించారు..


కామెంట్‌లు లేవు: