ఉత్తర వైపు దూసుకువస్తున్న బాణం, అశ్వత్థామ ఇంతకుముందు వదిలినదని గ్రహించాడు కృష్ణపరమాత్మ. అపాండవం చేయడం కోసం వదిలిన దివ్యాస్త్రం అది. ఉత్తర గర్భం వైపు దూసుకువస్తోంది. వెంటనే కృష్ణపరమాత్మ, చక్రాయుధుడై ఉత్తర గర్భాన్ని రక్షిస్తాడు.
****
సకలప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ
స్తకుఁడై, వైష్ణవమాయఁ గప్పి, కురు సంతానార్థియై యడ్డమై,
ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్.
****
సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తియై ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి, అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు.
🏵️ పోతన పద్యం🏵️
🏵️ఆపన్నులకు అభయప్రదం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి