27, సెప్టెంబర్ 2021, సోమవారం

తొలి తెలుగు పుస్తకం

 తెలుగు భాషలో ముద్రించబడిన తొలి తెలుగు పుస్తకం ?

..........................................................


(1) చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ కాలానికంటే ముందుగా తెలుగును జెంటూ (Gentoo) అని పిలిచేవారు. మనదేశానికి వర్తకానికై వచ్చిన పోర్చుగీసువారు మొదటగా భారతీయులను జెంటియోలని సంబోధించేవారు. అప్పట్లో తెలుగువారి ప్రాముఖ్యత ప్రముఖంగా వుండటంవలన తెలుగువారిని జెంటియోలని పిలిచేవారు. వారు తరువాతి క్రమంలో తెలుగుభాషను జెంటూ అని పిలిచారు. ఆ తరువాత వచ్చిన ఆంగ్లేయులు కూడా తెలుగుభాషను జెంటు అనియే పిలిచారు.


(2) తెలుగువారు పోర్చుగీసు వారిని బుడతకీచులని

డచ్చి (హాలెండ్) దేశస్తులను ఒలందులని

ఫ్రెంచివారిని ఫరాసు, ఫరంగీవారని

ఆంగ్లేయులను యింగిలీసు వారని పిలిచేవారు.

పోర్చుగీసువారు భారతీయ ముస్లీంలను మౌరోలని పిలిచేవారు. క్రమంగా మౌరోపదం మూరుగా మార్పుచెందింది. తదుపరి భారతీయ సాహిత్యంలో వీరిని మూరులుగానే పెర్కొనడం జరిగింది.


(3) ప్రస్తుతం మనకు స్వంతమైన బత్తాయి పండుమనదికాదు. ఐరోపాలోని బటేవియా ప్రాంతానికి చెందింది. డచ్చివారు దీనితోపాటుగా పంపరపనసను ఆంధ్రదేశానికి పరిచయం చేశారు.


(4) ప్రళయకావేరికే పులికాట్ అని పేరు. ప్రాచీనకాలంలో నేటి గుజరాతు ప్రాంతాన్ని గూర్జర/ గుజ్జరగా పిలిచేవారు.


(5) తెలుగులో ముద్రించబడిన మొదటిపుస్తకమేదంటే నూరు జ్ఞాన వచనాలు.షుల్జ్ 1746 లో ఐరోపాలో అచ్చువత్తించాడు.


॥సేకరణ॥

................................................................జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: