3, నవంబర్ 2020, మంగళవారం

శివానందలహారీ

 🙏 శివానందలహారీ 🙏


యథా బుద్ధిశ్శుక్తౌ రజత మితి కాచాశ్మని మణి

ర్జలే  పైష్టే  క్షీరం భవతి మృగతృష్ణాను సలిలమ్

తథా దేవభ్రా0త్యా భజతి భవదన్యం జడజనో 

మహాదేవేశం త్వాం మనసిచ నమత్వా పశుపతే  08



ముత్యంపు చిప్పను మోహాతిశయమున

            భాసిల్లు వెండిగా భ్రాంతి పడుట

గాజు ముక్కను గాంచి కడు మోహ మందియు

           మణివోలె మనమందు మనసు పడుట

చిక్కనౌ పిస్టంపు శ్వేత ద్రవంబును

          భ్రమచెందు చుండుట పాల పగిది

యెండమావుల నీటి భా0డారముల్ జూచి 

         భ్రాంతితో పయనించు పగిది గాను 

ఆన్య దేవత లందరిన్ న్ననుసరించి 

పరమ భగవాను పగిదిగా భ్రమను చెంది

పార్వతీ పతి ! నిను వీడి పామరుండు 

పూజ నొనరించు నిరతంబు బుద్ధి వీడి  

నిన్నె  నే నమ్మినాడను  నీలకంఠ !          08


✍️ గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: