.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;
మ||
భయముం జెందనదేటికో మనసు ? దుర్భావాది శార్దూల సం
చయముల్ మ్రింగునటంచుతన్; మఱచెనో సద్భక్తి నాత్మేశు నా
శ్రయముం బొంది సుఖించు మార్గమది;కూర్మంబాపదన్ దాట నే
క్రియ చిప్పం దలదాచు - నట్టి విధమున్ శ్రీ సిద్ధలింగేశ్వరా !
భావం;
తాబేలు ఆపదలు వచ్చినప్పుడు ఎలా చిప్పలో తల దాచుకొని తనను తాను రక్షించు కొంటుందో,
అలాగే
నేను కూడా
ఏ ఆపద వచ్చినా అంతర్ముఖ డినై
నా గుండె గుడిలో వెలిగే నిన్ను భక్తితో స్మరించుకుంటూ హాయిగా ఉండే మార్గాన్ని, ఎక్కడ మరిచి పోతానో,ఎక్కడ నన్ను పెద్దపులుల లాంటి చెడు ఆలోచనలు చుట్టూ ముట్టి మ్రింగేస్తా యోనని.
ఒక్కోసారి నా మనసు భీతి చెందుతుంది స్వామీ!
అలా కాకుండా
నువ్వే కాపాడాలి!శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి