3, నవంబర్ 2020, మంగళవారం

ఆత్మ దర్శనం

 *☘️ఆత్మ దర్శనం☘️* 


 *☘️మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం చేయలేము.* 


 *☘️మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది.  అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం.* 


 *☘️ మన మనసు మనకు ఆలోచననూ, విచక్షణనూ, కోరికలనూ, అవగాహననూ,* *విమర్శనాత్మక దృష్టినీ,* 

 *న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ, ఎన్నింటినో ఇచ్చింది. దానివలన మనం ఈ* *భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం!* 


 *☘️ భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం మనసు.* 


 *☘️ ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు. మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది.* 


 *☘️ధ్యానం, చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది. దాని నియంత్రణలో ఉంచుకోలేక పోతే అది మనలని వినాశనం వైపు నడిపిస్తుంది.* 


 *☘️ ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు. ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు.* 


 *☘️మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం. జీవిత లక్ష్యాలను సాధించగలం. దాని మానాన దానిని వదిలేస్తే* 

 *( శిక్షణ లేని మనసు* ) *అది మన వినాశనానికి హేతువులైన దురాశ, పగ, ప్రతీకారం, కామం, క్రోధం, గర్వం, అహంభావం ,*  *ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది.* 


 *☘️ మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి. అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి. మాయను అతిక్రమిస్తే ఆనందమనే భవనంలో హాయిగా విహారం చేయవచ్చును. ఇంత కధ నడిపించిన ఆ  రూపాయి ఏమిటో కాదు, మనం చేసుకున్న పుణ్యం.* 


 *☘️ జగన్నాటకం అనే సంత లోకి వచ్చిన ఈ జీవుడు ఆ దేవుడిని చేరుకునేలోపే మేల్కొంటే నిత్యానంద స్వరూపుడి దివ్య దర్శన భాగ్యం మనకు కలగతుంది.* 


 ☘️☘️☘️☘️☘️☘️

కామెంట్‌లు లేవు: