28, జూన్ 2024, శుక్రవారం

ముమ్మాటికీ మీరే

 జై శ్రీ రామ్ 


*మీ అమ్మాయిలకు వారసత్వ సంపదగా మణులు, మణిహారాలు ఇవ్వకండి... చీర బహుకరించండి! అదే జీవిత గమనాన్ని మారుస్తుంది!!* (బండారు శైలజా ప్రసాద్) 🙏🙏🙏🙏🙏🙏🙏"పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంది...చీర లో మెరిసి పోతుంది అని మీ బంధువులు అంటుంటే మీకు ఆకాశంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది...కానీ ఒక్క సారి మీరు వెనిక్కి తిరిగి గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ పోతే, ఒక రోజన్నా కాలేజీ కి మీ అమ్మాయిని చీర కట్టులో పంపారా? వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటున్నప్పుడు దిష్టి తీసి బయట పడేశారు..కానీ కనీసం ఆఫ్ సారీ లో అయినా కాలేజీ కి పంపాలని అనుకున్నారా? వంద మంది మగ పిల్లలు మీ అమ్మాయిని పొట్టి దుస్తుల్లో చూస్తుంటే ఎంత మంది మగ జాతి కళ్ళను తప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చి మీ అమ్మాయి కుమిలి కుమిలి ఏడిచింది మీరు గమనించారా? పక్కింటి పిల్ల జీన్స్ వేసుకుంది కదా అని మీ అమ్మాయి పై రుద్ది ఆమె మైండ్ సెట్ ను ప్రాశ్చాత్య సంస్కృతి పై మోజు పడేలా చేసింది ముమ్మాటికీ మీరే! నిజానికి ప్రాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న భారతీయులు చీర తప్పా వాళ్ళు పొట్టి దుస్తులు ధరించడం లేదు! తొమ్మిది గజాల స్త్రీ తత్త్వం చీర లో తప్పా మరే దాంట్లో కనబడదు! చీర దయ, శైలి, మన వారసత్వ సంపద!! నిజానికి రంగుల మనస్తత్వ శాస్త్రం చీర గురించి వివరిస్తే ఆ చీరలో ఇంత అద్భుతమైన అలంకరణ తో కూడిన నీతి ఉందా అనిపిస్తుంది...ఎందుకంటే మీరు ఇల్లు వదిలి బయట ప్రపంచంలోకి వెళితే చీర కున్న గౌరవ ప్రదమైన స్థానం మరి దేంట్లో లేదని ముమ్మాటికీ మీ మనసుకు తెలుసు! ఒక పెళ్లి రోజే మీ అమ్మాయిని సాక్షాత్తూ లక్ష్మి దేవీ లా ఉందని పొగుడుతున్న మీ బంధువులు రోజు సాంప్రదాయ దుస్తుల్లో వెళితే ఆమెకు మంచి మొగుడు రావడం ఖాయం!! ఎందుకంటే మన మనసే మనకు సాక్ష్యం...మన బెహేవియర్ ఎలా ఉంటే మనసు మాట వినక ఉంటుందా?! అసలు ఈ రంగుల ప్రపంచంలో చీర విశిష్టత గురించి వివరిస్తే మీకు చాలా నిజాలు అర్థం అవుతాయి!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చీరలలో రంగు మనస్తత్వశాస్త్రం యొక్క సింబాలిజం, అర్థం ఇమిడి ఉంది..

రంగు మన జీవితంలో అపారమైన శక్తిని ఇస్తుంది..కొత్త భావోద్వేగాలను రేకెత్తిస్తుంది, జ్ఞాపకాలను పదిల పరుస్తుంది. ఈ  ఫ్యాషన్ ప్రపంచంలో, వ్యక్తిత్వం మరియు సాంస్కృతిక ప్రతీకలను వ్యక్తీకరించడంలో *రంగు* కీలక పాత్ర పోషిస్తుంది!   వివిధ రంగుల వెనుక ఉన్న ప్రతీకవాదం మరియు అర్థాన్ని తెలుసుకుంటే... మహిమ గల చీర లో ఇంత పరమార్థం ఉందా అనుకుంటారు..

*ఎరుపు రంగు చీర* ఇదీ విప్లవ స్త్రీలకి ఆపాదించారు...కానీ ఇది ఒక ఉద్వేగభరితమైన ఆకర్షణ గల రంగు

ఎరుపు, అభిరుచి, ఆత్మవిశ్వాసం ఉట్టి పడేలా చేస్తుంది..  ఎర్రటి చీరను ధరించినప్పుడు , ఒక స్త్రీ విశ్వాసం తో పాటు  చైతన్యాన్ని వెదజల్లుతుంది. స్త్రీ ధైర్యానికి కూడా ఇదీ  ప్రతీక!   

*నీలం రంగు చీర* 

నీలం రంగు చీర  ప్రశాంతతకి మరోపేరు...ఈ చీర ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది!  ఇది చీరలలో కనిపించే బహుముఖ రంగు...చాలామంది లేడీ బ్యూరో క్రాట్స్, లేదా మహిళ కలెక్టర్లు అధికారిక కార్యక్రమాలలో ఈ చీర ధరిస్తారు... నీలం రంగు ప్రశాంతత భావాన్ని ఇస్తుంది. ఇది మహిళ  ఆలోచన యొక్క స్పష్టతను పెంచుతుందని నమ్ముతారు...చూపరులకు కూడా స్త్రీ ప్రశాంతత కనబడుతుంది! 

*నలుపు చీర* నిజానికి నలుపు విషాదానికి చిహ్నం అనుకుంటారు..అది ముమ్మాటికీ తప్పు...ఈ చీర చక్కదనం అనే పదానికి కేరాఫ్ అడ్రస్.. *శోకం* అనే పదం వల్ల ఈ నలుపు రంగు కు స్త్రీలు దూరంగా ఉంటారు.  ..ఇప్పుడు సెలబ్రెటీ మహిళలు సాయంత్రం వెళ్ళే పంక్షన్లలో నలుపు చీరలు ప్రత్యేకంగా ధరిస్తున్నారు!!  

*పసుపు చీర*: 

పసుపు చీరలు సానుకూల స్త్రీ తత్వానికి మచ్చు తునక...ప్రతి పండుగలు, శుభ కార్యాల్లో అడవారు ఇష్టపడే ఈ చీర  కొత్త ప్రారంభాలను, శుభాలను సూచిస్తుంది. మృదువైన పాస్టెల్ పసుపు రంగుల నుండి శక్తివంతమైన షేడ్స్ వరకు, ఈ చీరలు పండుగలు ఆనందకరమైన వేడుకలకు ప్రసిద్ధ ఎంపికలుగా స్ర్తీలు ధరిస్తున్నారు. పసుపు ఆశావాదంతో సంబంధం కలిగి ఉంటుందనీ మనస్తత్వ శాస్త్ర వేత్తలు అంటుంటారు..  

*ది రీగల్ చరిష్మా ఆఫ్ పర్పుల్ సారీ* గురించి చెప్పాలి అంటే...

పర్పుల్, రాయల్టీ మరియు లగ్జరీతో స్త్రీ కనిపించే వస్త్ర ధారణ!! 

*ఆకుపచ్చ చీర* సామరస్యం మరియు శ్రేయస్సు కు ప్రతిబింబం

ఆకుపచ్చ చీర ప్రకృతి రంగు కూడా! స్త్రీ మానసిక సమతుల్యత తో ఉంటుందని, జీవశక్తి, సమృద్ధి, జ్ఞాపక శక్తికి నిదర్శనమని అంటారు.. ఈ ఆకుపచ్చ చీర ప్రకృతితో సమకాలీకరించబడిన అనుభూతిని కలిగిస్తాయి!

*తెలుపు రంగు చీర* నిజానికి ఈ రంగును విధవలకు ఆపాదించారు... మన పూర్వీకులు!

తెల్ల చీరలు అపారమైన సాంస్కృతిక వార సత్వ  సంపద ఇమిడి ఉంది..అవి స్వచ్ఛత, అమాయకత్వం, ఆధ్యాత్మికతను సూచిస్తాయి. తెలుపు అనేది స్వచ్ఛత మరియు సరళతను సూచించే రంగు! ఇక

*పింక్* యొక్క భావోద్వేగ అభిరుచి

ఈ పింక్ కలర్.. లేత గులాబీ స్త్రీత్వం, సున్నితత్వం  సూచిస్తుంది...ఇలా రంగుల చీరల మనస్తత్వ సున్నితత్వం గురించి హ్యూమన్ సైకాలజీ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి...!!


జై శ్రీ రామ్ 

కంచెర్ల వేంకట రమణ

కామెంట్‌లు లేవు: