*నిత్యపూజలో మొదటి పూజ ఎవరికి చేయాలి ? ఎందుకు చేయాలి ?*
🌸🌸🌸
వైష్ణవ ధర్మంలో కూడా విష్వక్సేనుల వారి ఆరాధన చేస్తే ఆయనకున్న పద్దెనిమిది శిరస్సులలో తొమ్మిదవ శిరస్సు గణపతి. వైష్ణవమైనా, శైవమైనా, మధ్వమైనా యే ధర్మమైనా, యే మార్గమైనా అన్నింటికీ మూలము గణపతి. “గణానాం పతిః – గణపతి!” ఈ దేహంలో ఉండేటటువంటి ఎనిమిది అష్టకములకు పురీఅష్టకములని పేరు. సంక్షిప్తంగా జ్ఞాపకం పెట్టుకుంటే మన దేహం పైన మనకు నియంత్రణను కలిగించేవాడు గణపతి. దేహంపైన నియంత్రణ లేకపోతే మనస్సు చంచలమౌతుంది. గణపతి అనుగ్రహం లేని స్థితి అది. మానసిక స్థితిగతులన్నింటినీ నియంత్రించేవాడు గణపతి కనుక ఆయనను స్తోత్రం చేస్తే కూర్చునే బుద్దినిస్తాడు. శరీరం కూర్చోవడం కాదు మనస్సును కూర్చోబెట్టడం. చంచలమైన మనస్సును ఏదైనా ఒక విషయంపట్ల స్థిరంగా కూర్చోబెట్టగల నేర్పు గణపతికే ఉంది.
కనుక యే దేవతారాధన చేసినా, నిత్య దేవతారాధనలో కూడా గణపతి పూజకంటే పూర్వం “శ్రీగురుభ్యోనమః” అనాలి. గణపతిని, పూజావిధానాలను మనచేత ఆచరింపజేస్తున్నటువంటి వారు గురుదేవులు గనుక శ్రీగురుభ్యోనమః అని ప్రారంభం చేసి శ్రీమహాగణాధిపతయే నమః అనగానే మన శరీరం మీద ఒక ఆధిపత్యం మనకు వచ్చేస్తుంది. ఆధునిక భాషలో Command లేదా శరీరాన్ని Tune చేసుకోవడం అంటారు. నిత్యపూజలో గణపతికే మొదటి పూజ చేయాలి. గణపతి పూజ లఘువుగా చేసుకొని ఇష్టదేవతారాధన చేసుకోవచ్చు. గణపతికి కుంకుమ, గంధము, గరిక పెట్టి గణపతిని నైరుతి దిక్బాగంలోకి జరిపి ఆ పిమ్మట మిగతా పూజంతా చేస్తే మనకు కూర్చునేటటువంటి ఓపిక, లక్ష్యశుద్ధి, లక్షణ శుద్ధి ఏర్పడతాయి. కనుక నిత్యపూజలోనైనా గణపతిని సూక్ష్మంగానైనా పూజ చేయాలి.
🌸🌸🌸
*మీ... శివలోకం ప్రాజెక్ట్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి