భావం:- "అహం సమర్పయామి" అంటూ దేవుడికి మనం సమర్పించే పూజా ద్రవ్యాలను , నైవేద్యాలను గురించి విభిన్నమైన కోణంలో దర్శిస్తాడు కవి.
"స్వామీ ! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను అంటాడు .
హే లక్ష్మీ వల్లభ ! నేను నిన్ను పూజించే ఈ ద్రవ్యాలను సమర్పిస్తున్నాను కానీ , ఇవేవీ నావి కాదు . నీవి నీకే సమర్పిస్తున్నాను ! పరిమళ భరితమైన గంధ పుష్పములు , దీపపు నూనె , ఫలములు , అన్నము , పప్పు , పానకము , నేతి గారెలు , తీయని బూరెలు , మంచినీరు , వింజామరలు , తాంబూలం మొదలైన వస్తువులు అంటూ ... మనం సమర్పించే శోడషోపచార వస్తువులను ' నీవి నీకే సమర్పిస్తున్నాను ' అంటూ పలుకుతాడు . వీటిలో చూడడానికి ఒక్కటి కూడా నా తాత సొమ్ము లేదు . నావల్ల నీకు ఎలాంటి ఉపకారం కూడా లేదు . అంటూ చిత్రమైన భావనలతో వాపోతాడు శేషప్ప !
ఆలోచనాత్మకమైన , వైవిద్య భరితమైన ఇలాంటి పద్యాలు శేషప్ప శైలిని హిమాలయంపై కూర్చోబెడతాయి !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి