*ఈరోజు గుర్రం జాషువా గారి పుట్టిన రోజు.!!
జాషువా గారు ఓ వ్యక్తి కాదు..ఓ ఆలోచనా
స్రవంతి. జాషువా గారిని ఓ పక్క.. అంటరాని
వాడంటారు.మరోపక్క ఆయన అక్షరాలను
మాత్రం అక్కున చేర్చుకుంటారు...!!
అంటరానిది అక్షరమైతే...?
అది రాసినవాడెలా అంటరానివాడవు
తాడు?
అంటరాని అక్షర వసంతముంటుందా?
"కులము చెప్పమనుచు కొంటెవారలడుగ
పేరులోనె కలదు పేర్మికులమ-
టంచు చెప్పినట్టి హాస్యకవియతండు
జా షువాకులేవు భేషజాలు".!!
*గుడిసేవ విష్ణు ప్రసాద్..!!
ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకోలేక జాషువా
గారిని చిన్నచూపు చూసిన వారుఇప్పటికైనా
కళ్ళు తెరుస్తారా? ఈ మహాకవిని అక్కున
చేర్చుకుంటారా?
*కులమతాలు గీసుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టు పడను నేను
నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వ నరుడ నేను."!!
*జాషువాగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!!
*ఎ.రజాహుస్సేన్..!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి