2, అక్టోబర్ 2024, బుధవారం

అలంకార ప్రియో విష్ణు

 " అలంకార ప్రియో విష్ణు

 అభిషేక ప్రియః శివ

 నమస్కార ప్రియః  భాను

 బ్రాహ్మణ బహుజన ప్రియః "


సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము


ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే ఇష్టం, మరేమో


శివునికి అభిషేకమంటే ఇష్టము. సూర్యనారాయణుడికి


నమస్కారం ప్రీతి. బ్రాహ్మణునికి బహు జన (నాలుగు


వర్ణముల శ్రేయస్సే) ఇష్టమని. అందుకే అందరి శ్రేయస్సు


కోరే "గో బ్రహ్మణేభ్యా" అంటారు. బ్రాహ్మణుడు, గోవు తృప్తి


చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! అందుకే


బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే


ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని


దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు


నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన


చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి


'బ్రాహ్మణుడిని' గోవుని పూజిస్తారట! ఎందుకంటే


బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని,


ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి


మాతకు పరమాప్తులౌతారని"


కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట.

కామెంట్‌లు లేవు: