*హైందవం వర్ధిల్లాలి 18*
సభ్యులకు నమస్కారములు.
ఐకమత్యం(i):- అహంకారాలతోనో, ఆధిపత్య ధోరణితోనో లేక తీరికగా ఉండలేని ఉన్మాదంతోనో ప్రస్తుత దేశ మరియు ప్రాంతీయ రాజాకీయాలు రెచ్చగొట్టబడుతున్నాయి. ఎవరో నాయకులు, ఏదో పార్టీ ఇచ్చిన పిలుపు నందుకుని కొన్ని మాతాలలోనో, కులాలలోనో, వర్గాలలోనో అందులోని వ్యక్తులనో ఇప్పటికీ శత్రువులుగా భావిస్తూ పరస్పరం ద్వేషించుకునే పరిస్థితులు మనచుట్టూ కల్పించ బడుతున్నాయి.
ఇట్టి విచ్ఛిన్నకర శక్తుల ఆగడాలకు అడ్డుగోడ కట్టి దేశం యావత్తు శాంతి భద్రతలతో నెలకొనాలంటే అన్ని మతాలవారు
(హిందు, ముస్లిమ్, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధ, జైన, పార్సీ, యూదులు, జోరాష్టియన్లు, బహాయీలు), అన్ని కులాల వారు , అన్ని వర్గాలవారు అంటే సామాన్య ప్రజలు, మేధావులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, పారిశ్రామికులు, వ్యాపార వాణిజ్య వర్గాలు, వైజ్ఞానికులు, వైద్యవర్గము, సాంకేతిక వర్గము మున్నగు వారందరు సమైక్యంగా, సంఘటితంగా, ఐకమత్యంతో వీరిని (దుష్ట శక్తులను) ప్రతిఘటించాల్సిఉంటుంది. *ఐకమత్యం ద్వారా మాత్రమే* ఒకరికొకరు సన్నిహితులవుతారు. *మన దేశానికి స్వాతంత్రం వచ్చినది ఐకమత్యం ద్వారానే అని జ్ఞాపకం చేసుకుందాము*.
ఐకమత్యం అంటే ఏమిటో వివరంగా పరిశీలిద్దాము. ఒకటిగా, కల్సికట్టుగా, ఏకమతిత్వము, సమైక్యము, ఏక భావన, సంఘటితం గా కలిసి ఒక లక్ష్యం కొసం మనసా వాచా కర్మణా *అనుబంధము* ఇత్యాది అర్థాలు చెప్పుకొనవచ్చును. *అవుతే "నిష్కపటమైన అసమ్మతి" తొలగిన తదుపరి మాత్రమే ఐకమత్యము సాధ్యము*. ఐకమత్యం ప్రయోజనాలు గూడా నెమరు వేసుకుందాము.
ఐదు వ్రేళ్ళు బిగిస్తే *పిడికిలి*. ఆ పిడికిలే *శక్తివంతమైనది*. ఆ పిడికిలికి ఉన్న బలం మరియు శక్తి, విడి విడి వ్రేళ్లకు ఉండదు. ఆలాగే అన్నదమ్ములు, తోటి బంధు మిత్రులు, స్థానికులు, గ్రామాలు ,రాష్ట్రాలు అన్ని *ఒక త్రాటిపై ఉంటే* సాధించలేనిది ఏముంటుంది. ఐకమత్యాన్ని ఒక సత్యారాధనగా అదే సత్యంగా భావిద్దాము. *ఐకమత్యమేమహా బలం, అనైక్యతనే బలహీనత అని గుర్తుంచుకుందాము*.
ఐకమత్యంతో ఉంటే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించవచ్చును. *ఏకాకితనం వద్దు ఐకమత్యమే ముద్దు*. మనమందరం మన హిందూ బంధువులంతా అన్ని పండుగలు సామూహికంగా జరుపు కుందాము. *సామూహికము ఐకమత్యానికి పరస్పర సహకారానికి దోహదం చేస్తుంది.*
అన్ని కులాల కలయికనే హైందవం. హైందవం వర్ధిల్లాలి, హిందువులందరూ సుఖ శాంతులతో ఉండాలి అంటే, అన్ని కులాలు, వర్గాలు కల్సిమెల్సి ఒకరికొకరు తోడుగా *ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒకరు* అన్న చందాన ప్రజలందరూ సమైక్యంగా, అవిభక్తంగా ఉండి సమస్యలను, అడ్డంకులను తొలగించుకోవాలి.
ఇటువంటి ప్రేమ, మమతానురాగాలు, అభిమాన ఆప్యాయతలు, శాంతిపూర్వక సోదరీ సోదర తత్వాలు, శాంతి భద్రతా సామరస్యాలు, ఆత్మ గౌరవం గల ఐకమత్యం దేశ మంతటా విస్తరించాలి. *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి