🪔ఆలోచనాలోచనాలు🔦( అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క, లక్షమెదళ్ళకు కదలిక) ***** బాల్యంలో బిగ్గరగా ఏడ్చాం, కోరుకున్న వస్తువు చేతికందలేదని; పెద్దవారమయినాం. లోలోపల ఏడుస్తున్నాం, ఆశించిన వస్తువు చేతికందడం లేదని; మొత్తం మీద ఏడుపే జీవితంలో ప్రధానాంశం.-- ఇదీ మన జీవితం. ***** బాంధవ్యాలు గాజు వస్తువుల్లాంటివి. పగిలిపోతే విడచిపెట్టడమే మేలు; ఏదో విధంగా అతుకు పెట్టేబదులు. ఒక వేళ ప్రయత్నించినా వికారంగానే కనబడతాయి. ***** ప్రేమ అంటే ఏమిటి? నీ ఆనందానికి మరొకరి ఆనందాన్ని కలుపుకొని ,ఆపై ఇద్దరూ కలిసి ఆస్వాదించే మధుర పదార్థం. ***** జీవితంలో పెద్ద సవాలు , నిన్ను నీవు విశ్లేషించుకోవడం-- ఘనవిజయం అంటారా? కలిగివున్న వస్తువులతో సంతృప్తిని పొందడం--- ***** మేథావులు, విజేతలు పడక కుర్చీలు ( ఈజీ ఛైర్స్) లలో కూర్చొనో, డన్లప్ మెత్తని పరుపులపై దొర్లుతూ విజయాలను సాధించలేదు. వారు శ్రమించడంలోనే విశ్రాంతిని పొందుతారు. వారు కలలలోనే నిద్రించి, స్థిరనిర్ణయపు, అంకిత భావపు ఉషోదయాలలోనే మేల్కొంటారు. ***** స్త్రీ నిజాయితీని ఆమె పురుషుని దారిద్ర్యంలో పరిశీలించాలి; పురుషుని నిజాయితీని ఆతడి సౌభాగ్యంలో గమనించాలి! ***** ఎవరినో సంతృప్తిపరచడానికి బ్రతకడం ఎట్లాంటిది అంటే అద్దె ఇంటికి, రంగులద్ది అలంకరణలు గావించి తృప్తి చెందడంలాంటిది. ఎంతబాగా తీర్చిదిద్దినా, అది నీ స్వంతం అయితే కాదు. ఏదో ఒక రోజు దాని యజమానికి నీవు అప్పగించి నీవు నీదారి నీవ్వు చూసుకోవాలి. అది పరాయి ఇల్లే! నీ సంతృప్తి కొరకు నీవు జీవించు. అది నీ స్వంత ఇంటిని నీవు అలంకరించుకొన్నట్లు! ***** జీవితసాఫల్యానికి కనీస అవసరాలు. మొట్టమొదటిది పరిపూర్ణ ఆరోగ్యం. ఆ తరువాతది సంపదల సందోహం. శీలమా! అది శిరస్సుపై స్వర్ణ కిరీటం. గౌరవమా? అది నీ ఉనికిపై కప్పబడిన విలువైన చీనాంబరం. మలుపులా? నీ బ్రతుకు గెలుపులకు ఎలుగెత్తిన పిలుపులు. ఇక భగవానుని ఆశీస్సులా? అవి నీ భవిష్యత్తు అనే స్వర్ణపేటికలోని మణులరాశులు. ప్రేమ, ఉప్పొంగిన మకరందపు మాధుర్యం. అన్వేషణాపధంలో కరదీపిక నీవు ఆదర్శంగా నిలుపుకొన్న సత్యం. మరణం జీవితనాటకరంగంలో "చరమాంకం." తరువాత ఏముంటుంది? తెర క్రిందకు; శుభం కార్డు పైకి. - - - - - - - - - - - - - - - - - - - - - - - - Sharpen your mind! 1* Before Mount Everest was discovered, what was the tallest mountain? 2* When you need it you throw it away, when you don't need it you take it in. What is it? 3* What kind of table has no legs? 4* What is the first thing you do every morning? 5* As long as I eat, I live. When I drink, I die. Who am I? {For proper answers you have to wait 24 hours only.}. Dt. 23-- 11 --2023, Thursday, Good morning.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి