ఆరోగ్యపరముగా గుర్తు ఉంచుకొనవలసిన ముఖ్య నియమాలు -
* శరీరములో లోటు భర్తీ అగుటకు , శరీరం పెరుగుటకు మాంసకృత్తులు అవసరము. ఈ మాంసకృత్తులు పాలు , మాంసం , గుడ్లు , పప్పులు మొదలైన పదార్దములు తీసికొనవలెను.
* కొవ్వుపదార్ధాలు , కార్బోహైడ్రేట్లు శరీరము నందు తాపమును పెంచును. వాటిపైన మనము ఆధారపడి జీవించలేము. చక్కెర , గంజి (పిండి) ముఖ్యమైన కార్బోహైడ్రేట్స్ కలవు. గింజల చమురులో విటమిన్స్ లేవు .
* చేపనూనె , పాలు , వెన్న , నెయ్యి , ఆకుకూరలు , దుంపలు , మామిడిలో విటమిన్ A ఎక్కువుగా లభ్యం అగును. కండ్లు మరియు చర్మము సరైన స్థితిలో ఉంచుటకు కూడా విటమిన్ A అవసరం.
* గోధుమ , బియ్యపు తవుడు , తృణధాన్యాలు , పప్పు దినుసుల యందు B1 విటమిన్ కలదు. ఈ విటమిన్ సరిగ్గా ఉన్నచో నంజు వ్యాధి రాదు . మన శరీరం పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి B1 విటమిన్ అత్యంత ముఖ్యం అయినది.
* పాలు , కాలేయము , మాంసం , గుడ్లు , చేపల యందు B2 విటమిన్ ఎక్కువుగా ఉండును . ఈ విటమిన్ శరీరం పెరుగుదలకు , ఆరోగ్యమునకు అత్యంత అవసరం. కండ్లకు సంబంధించిన , పెదవులు , నోటికి సంబంధించిన జబ్బులు రాకుండా ఈ విటమిన్ కలిగిన పదార్ధాలను ఎక్కువుగా తీసికొనవలెను.
* తాజాపండ్లు , కూరగాయలు , మొలకెత్తిన ధాన్యములో C విటమిన్ ఎక్కువ లభ్యం అగును. ఇది స్కర్వీ వ్యాధి రాకుండా చేయును .
* పాలు , వెన్న , నెయ్యి , చేపలు , చేపనూనె యందు D విటమిన్ లభ్యం అగును. ప్రకృతిసిద్ధముగా సూర్యరశ్మి తగులుట వలన కూడా D విటమిన్ లభ్యం అగును. ఈ విటమిన్ ఎముకలు పెరుగును. ఈ విటమిన్ లోపము వలెనే రికెట్స్ అను వ్యాధి వచ్చును.
* పాలలో క్యాల్షియం ఎక్కువుగా లభ్యం అగును. పచ్చని ఆకుకూరలలో కూడా క్యాల్షియం ఉన్నది . ఎముకలు బలంగా ఉండుటకు , మంచి పెరుగుదల , ఆరోగ్యముగా ఉండుటకు క్యాల్షియం అవసరం.
* శరీరము నందు రక్తం వృద్ది అగుటకు ఇనుము అవసరం. రక్తహీనత వలన కలుగు జబ్బుల వలన భాధపడువారికి ఎక్కువ ఇనుము అవసరం. ధాన్యములలో , పప్పులలో , ఆకుకూరలలో ఇనుము ఎక్కువుగా ఉండును.
* బాగా మరపట్టిన తెల్లటి బియ్యము కంటే దంపుడు బియ్యము లేక ఒక్కసారి పట్టు పట్టిన మరబియ్యం చాలా మంచివి. తెల్ల గోధుమ రొట్టె కంటే చపాతీలుగా కాని , బ్రౌన్ రొట్టె కాని మంచివి.
* మన శరీరానికి అవసరం అయిన పదార్ధాలు బియ్యము నందు కాని గోధుమల యందు కాని లేవు . ఆహారములో వీటితో పాటు పాలు , పప్పులు , పండ్లు , కాయగూరలు , ఆకుకూరలు తగినంత ప్రమాణములో ఉండవలెను.
* తీపి వస్తువులను గాని , తీపి చిరుతిండ్లును గాని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అవి మనకు మాంసకృత్తులును గాని , విటమిన్లు కాని , ఖనిజాలు ను గాని ఇవ్వవు. అంతేకాకుండా ఆకలిని కూడా చంపివేయును
* అన్ని ఆహారపదార్ధాల కంటే ఉత్తమమైన ఆహారం పాలు . బియ్యము వంటి ధాన్యములలో లోటుగా ఉన్న అన్నిరకములైన పోషక పదార్దాలను పాలు భర్తీ చేయును .
మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి