.
*గతం*
ప్రపంచంలో అన్నింటికంటే బరువైనది గతాన్ని మొయ్యడం. దానికన్నా రోడ్ రోలర్ తేలికగా ఉంటుంది. మనిషికి దుఃఖమనేది లేదు. గతాన్ని తలపెట్టు కోవడమే దుఃఖం.
కష్టపడి పనిచేసుకునే వాడికి గతం గుర్తుకు రాదు. సోమరితనంతో ఉన్నవాడికే గతం గుర్తుకు వస్తుంది. సోమరితనమే దుబారా. జీవితసారాన్ని పిండి చెప్పిన అందమైన మాటలివి.
నీ ఆలోచనే మనస్సులో ముద్ర వేస్తుంది. కాబట్టి అజాగ్రత్త పనికిరాదు.
ఒక బెంగ తరువాత ఒక బెంగ, ఒక పరాభవం తరువాత ఇంకో పరాభవం, ఒక భూకంపం తరువాత మరో భూకంపం. అవి ఏమీ లేకుండా కుటుంబం అంతా సుఖంగా ఉన్నాము అనుకోండి, ఎవరో ఒకరు కుటుంబంలోంచి జారిపోతాారు.
"ఇది అంతా ప్రకృతి పని. అధిష్ఠానం ఈశ్వరుడు అని మరిచి పోకండి. మీ ముఖం ఆయన వైపు తిప్పండి".
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి