*
ఈ సృష్టి మొత్తం అర్ధ నారీశ్వర తత్వంతో నిండి ఉన్నది..
అందుకే వారు ఈ సృష్టికే ఆది దంపతులు, తల్లిదండ్రులు.
ఏ ఒక్కరు లేకున్నా, ఈ సృష్టి లేదు.
అమ్మ శక్తి స్వరూపిణి అయితే ఆ శక్తికి చైతన్యము, కదలిక ఇచ్చేది అయ్యవారు.
ఇది ప్రతి విషయంలో అన్వయించవచ్చు..
ఉదా.. మాట అయ్యవారైతే మాటలోని శబ్దం అమ్మవారు..
అలాగే దృష్టి, దృశ్యము... [చూపు (చూసే శక్తి), చూసే వస్తువు]
గమనము .. చలనము.. (నడక, నడిచే శక్తి)
ధ్యాని, ధ్యేయ వస్తువు...
ఇలా ప్రాకృతికమైన బంధంతో ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడన్న సత్యమును గ్రహించడం మనం చేసే ధ్యానము...
ఆ రెండూ ఒకటే అన్న సత్యాన్ని గ్రహించి, అనుభూతి చెంది, తానే ఈశ్వరుడుగా మారడం అఖండ సమాధి స్థితి...
🙏🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచల శివ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి