శ్లోకం:☝️
*అవిరోధితయా కర్మ*
*నాఽవిద్యాం వినివర్తయేత్ |*
*విద్యాఽవిద్యాం నిహంత్యేవ*
*తేజస్తిమిర సంఘవత్ ||*
భావం: కర్మ అజ్ఞానాన్ని (మాయను) నశింపజేయలేదు. ఎందుకంటే అవి రెండూ పరస్పర విరుద్ధములు కావు కనుక. వెలుగు మాత్రమే చీకటిని పారద్రోలినట్లు జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలగలదు. కానీ నిష్కామకర్మ ఆచరించుట వలన చిత్తశుద్ధి కలుగును.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి