13, అక్టోబర్ 2022, గురువారం

నిఖార్సయిన నిజం

 ఢిల్లీని పరిపాలించిన మొదటి బానిస వంశ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ గుర్రం మీదనుండి జారి క్రిందపడి మరణించాడనే కధ మన పిల్లల పాఠ్యపుస్తకాలలో వుంది. కాని పదకొండు సంవత్సరాల వయసులోనే అశ్వా రోహణం నేర్చుకుని అనేకయుధ్ధాలు గుర్రపుస్వారీ తోనే చేసిన ఒక ఆర్మీ జనరల్ సైన్యాద్యక్షుడు గుఱ్ఱం మీదనుండి జారి క్రిందపడి చనిపోవటం హాస్యాస్పదం గా లేదూ? చిన్నప్పటి నుండి గుఱ్ఱా లను దౌడుతీయించగల కుతుబుద్దీన్ గుఱ్ఱం మీదనుంచి పడి చనిపోవటం నమ్మశక్యంగా వుందా? 

  ఈ కధనం సత్యానికి అసత్యానికీ వున్నంత దూరం... నిజానికీ కల్పన కీ వున్నంత తేడా .వాస్తవంని మరుగుపరచటంలో చూపిన అతితెలివి..

    అసలు జరిగిన సంఘటనని భూస్ధాపితం చేద్దామనుకున్నా , నిజం సజీవంగా నిటారుగా పాతిపెట్టిన గోరీలలోనుండి నిటారుగా నిలబడుతుంది.. 

   నిజం ఏమిటంటే బానిసరాజు సుల్తాన్ కుత్బుద్దీన్ఐబెక్ రాజపుటానాలో మేవాడ్ రాజు ను చంపి, అక్కడ ధనరాసులను కొల్లగొట్టి యువరాజు కరణ్ సింగ్ నీ అతని అశ్వమైన "శుభ్రక్" నీ కూడా లాహోర్ కి తరలించాడు ..ఈ క్రమంలో కరణ్ సింగ్ తప్పించుకునే ప్రయత్నం చేసి దురదృష్టవశాత్తూ పట్టుపడ్డాడు..

 ఈ బానిసరాజు కుతుబుద్దీన్ ఎంత కౄరుడు అంటే మేవాడ్ యువరాజు కరణ్ సింగ్ కు మరణశిక్ష తల తీయించటం విధించాడు ..అంతేకాదు ఇంకా పరమ కిరాతకం ఏమిటంటే కరణ్సింగ్ తలను బంతిలా వుపయోగించి పోలో ఆటకు సిధ్ధపడటం... 

  శిక్ష అమలు అయేరోజు న కుతుబుద్దీన్ ఐబెక్ కరణ్ సింగ్ అశ్వం శుభ్రక్ ఎక్కి వంద్య స్ధానం కి వచ్చాడు. అక్కడ కరణ్ సింగ్ తలఖండించేదుకు రంగంసిధ్ధంగా వుంది సుల్తాన్ అనుజ్ఞ ఇవ్వటమే ఆలస్యం ...ఇంతలో అందరూ తృళ్ళిపడేలా నివ్వెర పోయేలా ఒక పరమాధ్భుతం జరిగింది..తన యజమాని కరణ్ సింగ్ ని చూడగానే ఆ ధవళాశ్వం లో ఎవరూవూహించని సంచలనం కలిగింది ఘీంకారం చేస్తూ ఎగిరెగిరి పడింది కదనమాడింది. భీకరంగా గంతులువేసింది...డెక్కల చప్పుడు మరణమృదంగం వాయించాయి...కుతుబుద్దీన్ తరం కాలేదు తురగాన్ని పట్టుకోవటం అంతే మోరపైకెత్తి విన్యాసం చేసే అశ్వరాజ నూపురం నుండి ధడేలున క్రిందపడ్డాడు శుభ్రక్ పదవిన్యాసం ఈ సారి నేలమీద కాదు ..అతి కౄరుడైన కుతుబుద్దీన్ గుండెలమీద ముఖంమీద ... అశ్వం చేసే బలమైన పదఘటన కుతుబుద్దీన్ గుండెలమీద బలంగా పదేపదే తగలటం తో అక్కడక్కడే మరణించాడు.. చుట్టూ సైనికులు నిర్ఘాంత పోయి చూస్తుండగా, తన వద్దకు వచ్చి నిలబడిన శుభ్రక్ ని ఎక్కి కరణ్ సింగ్ అదే దౌడు తీసాడు...శుభ్రక్ ఆఘమేఘాలమీద తన జీవితంలో ఏనాడూ ఎరగనంత పరుగు తీసింది..మూడురోజులు వూపిరి సలపనంతగా పరుగు పెట్టీ పెట్టీ మేవాడ్ రాజద్వారం వద్దకు వచ్చి ఆగింది .. రాజధాని ప్రవేశద్వారంవద్ద శుభ్రక్ శిలాప్రతిమలా నిలబడింది . కరణ్ సింగ్ క్రిందకు దిగి అత్యంత ప్రేమతో కృతజ్ఞత తో ఆప్యాయంగా తన ప్రియతమఅశ్వం వదనాన్ని చేతులలోకి తీసుకోబోయి క్రందపడిపోయే ప్రాణదాతను చూసి నిర్ఘాంత పోయాడు.. తన యజమాని కి జీవితం ఇచ్చి కాపాడిన శుభ్రక్ తనువు చాలించింది ..

  ఆ అత్యుతమ అశ్వం తన యువరాజును గమ్యం చేర్చింది ..

 మనం మహారాణా ప్రతాప్ చేతక్ గురించి చదివాం .కాని తన ప్రాణాలు పణంగా పెట్టి తన పని విజయవంతంగా నిర్వర్తించిన శుభ్రక్ గురించి ఎవరికీ తెలియదు ..శుభ్రక్ కృతజ్ఞత కు మరో రూపం కదా.

 వెన్ను జలదరింపచేసే ఈ గొప్ప వాస్తవాలనూ, పచ్చి నిజాలను భూస్ధాపితం చేసి మన పిల్లల పాఠ్యపుస్తకాలలోకి అడుగు పెట్టకుండా చేసిన ఘనత ఎవరిదో అందరికీ తెలిసినదేకదా.. "శుభ్రక్ " పేరు కూడా మనం వినలేదు . అవును ..మనకెవరికీ తెలియదు.. 

 ఇలాంటి ఎన్నో నిజాలు హత్యచేసి గోరీకట్టిన వాస్తవాలెన్నో ..కాని నిజం నిటారుగా నిలబడి అందరికీ కనిపించక మానదు ..

  దయచేసి ఈ నిఖార్సయిన నిజంని షేర్ చేయటం మరవకండి ..అందరికీ తెలియాలంటే ఇదొకటే సాధనం మరి.. 


జైహింద్..

కామెంట్‌లు లేవు: