14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

భవిష్యపురాణము

 *భవిష్యపురాణము*


*విప్రో వృక్ష స్తస్య మూలం హి సంధ్యా వేదాశ్శాఖా ధర్మకర్మాణి పర్ణాః తస్మాన్మూలం యత్నతో రక్షణీయం మూలేచ్ఛిన్నే నైవ శాఖా న పర్ణాః ॥* 


భావం:


బ్రాహ్మణుడు వృక్షము, దానికి కూకటివేరు సంధ్యోపాసనము. వేదములు కొమ్మలు. ధర్మకర్మలు ఆకులు.  కావుననిట్టి బ్రాహ్మణుడను చెట్టుయొక్క కూకటి వేరును (సంధ్యావందనమును) మిక్కిలి ప్రయత్నముతో రక్షింపవలెను, లేని యెడల కూకటివేరునే నఱకి వేసిన యెడల (సంధ్యావందనమును చేయని యెడల) చెట్టు చచ్చిపోవును. అనగా బ్రాహ్మణుని బ్రాహ్మణ్యము పోవును. కాగా కొమ్మలగు వేదములుండవు, ఆకులగు ధర్మకార్యము లుండవు. అనగా సంధ్యోపాసనను చేయని యెడల వాని బ్రాహ్మణ్యము పోయి వేదములు చదువుటకును, ధర్మకార్యములు చేయుటకును అర్హుడుకాడని భావము. 


అందువలన ఎన్ని పనులున్నను, సంధ్యోపాసన చేయుటకొరకు మిక్కిలి ప్రయత్నముతో నెటులైనను సమయమును (ఇరువది యైదు లేక ఇరువది నిమిషములైనను) చేసికొని సంధ్యా వందనమునకు లోపము కాకుండ కాపాడుకొనవలెనని భావము. 


బ్రాహ్మణుని బ్రాహ్మణ్యమునకును,  వేదములకును, వైదిక కర్మలకును సంధ్యోపాసనమే జీవనదాయియై యత్యంత ముఖ్యమైనదని తేటతెల్లముగ జెప్పబడినది. 


ఆహా! ఎంత అమూల్యార్థము గల శ్లోకము !

కామెంట్‌లు లేవు: