🔔 *అనుబంధం* 🔔
*మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!!*
*మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు*
1. *తల్లి*
మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి,మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన తల్లి 1వ అద్భుతం!
2. *తండ్రి*
మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని తాను అనుభవిస్తూ,సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి 2వ అద్భుతం!
3. *తోడబుట్టిన వాళ్ళు*
మన తప్పులను వెనకేసుకురావాడానికి,మనతో పోట్లాడడానికి,మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు 3వ అద్భుతం!
4..*స్నేహితులు*
మన భావాలను పంచుకోవడానికి,మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి, ఏది ఆశించకుండామనకు దొరికిన స్నేహితులు. 4వ అద్భుతం!
5. *భార్య / భర్త*
ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలనుఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే,ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే 5వ అద్భుతం మన సొంతం!
6. *పిల్లలు*
మనలో స్వార్థం మొదలవుతుంది.మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది.వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లి తండ్రులు అసలు ఉండరు...
పిల్లలు..6వ అద్భుతం!
_*అన్ని అయిపోయాయి..
ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?*_
7. *మనవళ్ళు..మనవరాళ్లు*
వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతంగా మళ్ళీ పసిపిల్లలం..అయిపోతాం.వీరు మన జీవితానికి దొరికిన.. 7వ అద్భుతం!
*ఇన్ని అద్భుతాలమధ్య తిరుగుతూ,వీటి విలువలు మరిచి బ్రతుకుతున్న మనం మహా అద్భుతం..! కాసింత ప్రేమ చాలు,ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి.చిన్న పలకరింపు చాలుమనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి
మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి